యంగ్ బ్యూటీ మాయలో చైతన్య.. 'బంగార్రాజు' సాక్షిగా దొరికిపోయారు!
on Jan 11, 2022

అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఇద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే సమంతతో విడిపోయిన చైతన్య తాజాగా ఓ యంగ్ హీరోయిన్ కి దగ్గరయ్యాడన్న సందేహం వ్యక్తమవుతోంది.
అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేయనున్న యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ కి, చైతన్యకి నడుమ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. నాగార్జున మాట్లాడుతున్న సమయంలో వేదికపై ఉన్న చైతన్య వెనక్కి తిరిగి దక్ష నాగర్కర్ వైపు చూసి స్మైల్ ఇచ్చాడు. దీంతో ఆమె కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్వగా.. చైతన్య సిగ్గుపడుతూ తల దించుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'ఏకే రావు పీకే రావు' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన దక్ష నాగర్కర్.. హోరాహోరీ, హుషారు, జాంబీ రెడ్డి వంటి సినిమాలలో నటించింది. ఇప్పుడు 'బంగార్రాజు' లో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. అయితే ఈ యంగ్ బ్యూటీకి చైతన్య వైపు చూసి కళ్ళు ఎగరేసే అంత చనువు ఉండటంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాములుగా సినిమాలో హీరోయిన్ గా నటిస్తే హీరోతో ఎక్కువగా ట్రావెల్ అవుతారు కాబట్టి ఇద్దరి మధ్య ఆ చనువు ఉంటుంది. కానీ ఈ యంగ్ బ్యూటీకి ఇంత తక్కువ టైములో చైతన్యతో అంత చనువు ఎలా ఏర్పడిందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది క్యాజువల్ గా జరిగిన ఘటనా? లేక ఈ యంగ్ బ్యూటీ చైతన్యను మాయ చేసిందా? అంటూ చర్చలు నడుస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



