కొత్త హీరోతో అనుపమ లిప్ లాక్.. 'డబ్బిస్తే ఏమైనా చేస్తావా?' నెటిజన్స్ ట్రోలింగ్!
on Jan 11, 2022

రెండు రోజుల క్రితం 'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజయింది. అందులో హీరో ఆశిష్‌తో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లిప్ లాప్ సీన్ ఒకటి చూపించారు. అప్పట్నుంచీ అనుపమను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ వస్తున్నారు నెటిజన్లు. 'రౌడీ బాయ్స్' మూవీ ద్వారా దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. మరో నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సహిదేవ్ విక్రమ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హర్ష కొనుగంటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రౌడీ బాయ్స్ విడుదలవుతోంది.
కాగా, ఇప్పటివరకు పలు సినిమాలు చేసిన అనుపమ లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉంది. టాలీవుడ్‌లో నాగచైతన్య, నితిన్, శర్వానంద్, రామ్, నాని, సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలతో నటించినా, ఎవరితోనూ ఇంటిమేట్ సీన్స్‌లో నటించలేదు. లిప్ లాక్‌లకు దూరంగా ఉంది. అలాంటిది ఒక కొత్త హీరో అయిన ఆశిష్‌తో రౌడీ బాయ్స్‌లో ఆమె చుంబన సన్నివేశం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ మూవీగా రూపొందిన 'రౌడీ బాయ్స్'లో అనుపమ, ఆశిష్ మధ్య లిప్ లాప్ సీన్లే కాకుండా, ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయని వినిపిస్తోంది. ట్రైలర్‌లో చూపించింది జస్ట్.. శాంపిల్ మాత్రమే అంటున్నారు. ఏదేమైనా ఆ సీన్ ఇమేజ్‌ను షేర్ చేస్తూ, "కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలి. ఎంత రెమ్యూనరేషన్ ఇస్తే మాత్రం కొత్త హీరోకు లిప్ లాప్ ఇస్తావా?" అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. "నీ పర్సనల్ ఇమేజ్ ఏమైంది?" అని కూడా అడుగుతున్నారు. "ఆశిష్ ఎంత పెద్ద నిర్మాత కుటుంబం నుంచి వస్తే మాత్రం డబ్బుకోసం ఇంతగా దిగజారాలా? డబ్బిస్తే ఏమైనా చేస్తావా?" అని ట్రోల్ చేస్తున్నారు.
అయితే అనుపమ అభిమానులు మాత్రం ఆమెను వెనకేసుకు వస్తున్నారు. సీన్ డిమాండ్‌ను బట్టే ఆమె లిప్ లాక్ సీన్ చేసిందనీ, 'రౌడీ బాయ్స్' మూవీ నటిగా అనుపమకు మంచి పేరు తెస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



