వాణీకి షారుక్ గోల్డెన్ ఛాన్స్
on Apr 4, 2014
యాష్రాజ్ బ్యానర్లో "శుద్ధ్ దేశీ రొమాన్స్", "ఆహా కళ్యాణం" వంటి చిత్రాల్లో నటించిన హాట్ బ్యూటీ వాణీకపూర్ మరో ఛాన్స్ కొట్టేసింది. షారూక్ ఖాన్ హీరోగా యాష్రాజ్ బ్యానర్ ఓ కొత్త సినిమాకి ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి "ఫ్యాన్" అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో షారుక్ సరసన హీరోయిన్ గా వాణీని ఎంపిక చేసుకున్నారు. తను నటించిన ఈ రెండు చిత్రాల తరువాత అవకాశాలు రావట్లేదని బాధపడుతున్న ఈ అమ్మడికి షారుక్ సరసన నటించే అవకాశం రావడంతో ఆనందంతో ఎగిరిగంతేస్తుందట. మరి ఈ సినిమాతోనైనా ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయో లేదు చూడాలి.