రానా బర్త్ డే సర్ప్రైజ్.. 'విరాట పర్వం' నుంచి పవర్ ఫుల్ వీడియో
on Dec 14, 2021
.webp)
రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విరాట పర్వం'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి 'The Voice Of Ravanna' పేరుతో ఒక వీడియో విడుదలైంది.
Also Read: కృష్ణ 'మాయదారి మల్లిగాడు' మూవీతో సత్యానంద్ ఎలా రైటర్ అయ్యారో తెలుసా?
నేడు(డిసెంబర్ 14) రానా పుట్టినరోజు సందర్భంగా 'The Voice Of Ravanna' పేరుతో మేకర్స్ ఒక వీడియో విడుదల చేశారు. 'మారదులే ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే' అంటూ సాగే వాయిస్ ఓవర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. 'ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకులు ఛలో పరుగెత్తు' అంటూ రోమాలు నిక్కబొడుచుకునేలా రానా వాయిస్ చెప్పాడు. వీడియో కూడా విజువల్ గా ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి ఆవేదన, రానా ఆవేశంతో వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక వీడియో చివరిలో ఈ మూవీ ట్రైలర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: సాయిపల్లవికి ఆ ఫీట్ రిపీట్ అవుతుందా!
1990 లలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా, నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'విరాట పర్వం' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



