సాయిపల్లవికి ఆ ఫీట్ రిపీట్ అవుతుందా!
on Dec 13, 2021

మాలీవుడ్ సెన్సేషన్ `ప్రేమమ్` (2015)తో కథానాయికగా తొలి అడుగేసిన సాయిపల్లవి.. మొదటి ప్రయత్నంలోనే మెమరబుల్ హిట్ ని అందుకుంది. ఆనక `ఫిదా`తో తెలుగు తెరపై తొలిసారిగా దర్శనమిచ్చింది. ఫస్ట్ టాలీవుడ్ ఫిల్మ్ తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సాయిపల్లవి. ఆపై వెనువెంటనే వచ్చిన `ఎంసీఏ`తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. అలా.. 2017లో `ఫిదా`, ఎంసీఏ` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని తన సొంతం చేసుకుందీ డాన్సింగ్ సెన్సేషన్. అయితే, ఆ తరువాత మాత్రం ఈ ఫీట్ ని రిపీట్ చేయలేకపోయింది.
అన్ని భాషల్లోనూ బన్నీ నోట అదే మాట.. 'తగ్గేదే లే'!
ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది `లవ్ స్టోరి` వంటి విజయవంతమైన చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన సాయిపల్లవి.. ఈ క్రిస్మస్ కి `శ్యామ్ సింగ రాయ్`తో పలకరించనుండడంతో అందరి దృష్టి ఆ సినిమాపై ఉంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 2017లో మొదట శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన `ఫిదా`తో ఘనవిజయం అందుకున్న పల్లవి.. ఆపై నాని హీరోగా నటించిన `ఎంసీఏ`తో ఆ పరంపరని కొనసాగించింది. మళ్ళీ నాలుగేళ్ళ తరువాత శేఖర్ కమ్ముల రూపొందించిన `లవ్ స్టోరి` సినిమా తరువాత నాని కాంబినేషన్ లోనే `శ్యామ్ సింగ రాయ్`తో రాబోతోంది. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయితే మరోసారి పల్లవి ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ క్రెడిట్ అయినట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో!
'శ్యామ్' అండ్ 'శ్యామ్'.. సేమ్ టు సేమ్!
కాగా, డిసెంబర్ 24న రిలీజ్ కానున్న `శ్యామ్ సింగ రాయ్`కి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఇందులో బెంగాలీ యువతిగా కనిపించనుంది సాయిపల్లవి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



