శృంగారంతో ఆనందం..అషురెడ్డి బోల్డ్ కామెంట్స్
on Dec 14, 2021

రామ్ గోపాల్ వర్మ తన కంటికి ఎవరు బోల్డ్ గా కనిపింస్తే వారితో తనకు నచ్చిన సినిమా చేయడం, లేదా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయడం అలవాటుగా మారింది. మియా మాల్కోవాతో జీఎస్టీ అంటూ ఓ మసాలా సినిమాని తెరకెక్కించి సంచలనం సృష్టించిన వర్మ ఆ మధ్య అరియానా గ్లోరీ తో వర్కవుట్ ల వీడియోని, ఆ తరువాత అషురెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూని చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ తరువాత అషురెడ్డి `స్టార్ మా`లో ఓంకార్ నిర్వహిస్తున్న కామెడీ స్టార్స్ షోకి డుమ్మా కొట్టడం మొదలుపెట్టింది. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ కోసం వింత వింత వీడియోలు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అయ్యానంటూ ఓ ప్రాంక్ వీడియో చేసి నెటిజన్ ల చేతి చివాట్లు తిన్న అషు రెడ్డి తాజాగా వర్మ పై బోల్డ్ కామెంట్ లు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆర్జీవి తీరు, ఆయన లీడ్ చేసే శృంగార జీవితం గురించి అషురెడ్డి షాకింగ్ కామెంట్ లు చేసింది.
శ్రీముఖి దెబ్బకి స్పృహ కోల్పోయిన నాగబాబు
ఆర్జీవీతో చాలా సార్లు వ్యక్తిగత విషయాలతో పాటు శృంగార విషయాల్ని కూడా చర్చించానని, ఆయన ప్రతి విషయాన్ని చాలా గొప్పగా వివరిస్తారని తెలిపింది. ముఖ్యంగా శృంగార జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఆయన వివరంగా చెప్పారని, ఈ రోజుల్లో అలా చెప్పడం తప్పుకాదని తాను భావిస్తున్నానని చెప్పి షాకిచ్చింది అషు రెడ్డి. అషు రెడ్డి శృంగారం గురించి, వర్మ గురించి వివరిస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



