శ్రీనువైట్లతో చరణ్ సినిమా ఉందట
on Oct 28, 2014
గోవిందుడు అందరివాడేలే తరవాత శ్రీనువైట్ల తో సినిమా చేద్దామనుకొన్నాడు రామ్ చరణ్. ఆగడు సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకొన్నాడు. వైట్లతో సినిమా ఉంది కదా అని మరొకరికి కమిట్ కాలేదు. మరో వైపు శ్రీనువైట్ల కూడా ఖాళీ అయిపోయాడు. దాంతో రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏమిటి? ఎవరితో జట్టు కడతాడు?? అనే విషయాల్లో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. చరణ్ దాదాపుగా ఖాళీ అని ఫిల్మ్‌నగర్ వర్గాలు కూడా చెప్పుకొచ్చాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆగిపోయిందనుకొన్న శ్రీనువైట్ల సినిమా మళ్లీ పట్టాలెక్కించడానికి చరణ్ సై అన్నాడు. దాంతో శ్రీనువైట్ల - చరణ్ సినిమా ఎట్టకేలకు ఓకే అయ్యిందని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.