లాఠీఛార్జ్ లో గాయపడిన ఫ్యాన్స్.. బన్నీ రియాక్షన్!
on Dec 14, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయనను కలవాలని, ఆయనతో ఫోటో దిగాలని ఎందరో ఆశపడుతుంటారు. అయితే తాజాగా ఫోటో సెషన్ పేరుతో చేసిన హంగామా ఫ్యాన్స్ లాఠీ దెబ్బలు తినడానికి కారణమైంది. దీంతో ఇంకెప్పుడూ ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటానని బన్నీ ట్వీట్ చేశారు.
Also Read: బన్నీకి జక్కన్న స్మూత్ వార్నింగ్!
బన్నీతో ఫోటో సెషన్ ఉందని తెలుసుకొని సోమవారం గీతాఆర్ట్స్ ఆఫీస్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. అయితే అక్కడి సిబ్బంది ఫోటో సెషన్ లేదని చెప్పడంతో.. నిరాశ చెందిన ఫ్యాన్స్ బన్నీ రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో బన్నీ ఎన్-కన్వెన్షన్ సెంటర్ కు వస్తారని.. అక్కడ ఫ్యాన్స్ మీట్, ఫోటో సెషన్ ఉంటుందంటూ సమాచారం రావడంతో.. ఫ్యాన్స్ అంత ఎన్-కన్వెన్షన్ కు తరలివెళ్లారు. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రావడంతో తోపులాట జరిగింది. వారిని నిలువరించే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయడంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో.. ఎన్- కన్వెన్షన్ దగ్గర కూడా ఫోటో సెషన్ ను రద్దు చేశారు.

ఫ్యాన్స్ గాయపడిన విషయం తెలుసుకున్న బన్నీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఫ్యాన్స్ మీట్ ఈవెంట్ కు వచ్చి నా అభిమానులు గాయపడినట్లు తెలిసింది. నా టీమ్ వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నాకు అతి పెద్ద ఆస్తి" అంటూ బన్నీ ట్వీట్ చేశారు.
Also Read: 'రష్మిక'కు బాధ కలిగించిన 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్!
మరోవైపు ఆదివారం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ జరిగిన పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా పలువురు గాయపడ్డారు. దీనిపై స్పందించిన రష్మిక.. ఈ విషయం తనకు బాధ కలిగిందని, అందరూ జాగ్రత్తగా ఉండండని ట్వీట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



