'పుష్ప'ను సరిగా ప్రమోట్ చెయ్యమంటూ బన్నీకి జక్కన్న స్మూత్ వార్నింగ్!
on Dec 13, 2021

"పుష్ప కేవలం నీ సినిమా కాదు, ఇది తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్. ఎంత దూరంగా వెళ్లాలో, ఎంత పెద్దగా వెళ్లాలో వెళ్లాలి." అని అల్లు అర్జున్‌కు సూచించారు అగ్ర దర్శకుడు యస్.యస్. రాజమౌళి. ఆదివారం రాత్రి జరిగిన 'పుష్ప' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జక్కన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉండటంతో ఈ ఈవెంట్‌కు అటెండ్ కాలేకపోయాడు. కాగా అందరూ 'పుష్ప' కోసం అత్యంత కుతూహలంగా ఎదురుచూస్తున్నారనీ, కానీ అందుకు తగ్గ ప్రమోషన్ జరగట్లేదనీ తన స్పీచ్‌లో ఒకింత బాధ వ్యక్తం చేశారు జక్కన్న. ముంబైలో ఈ మూవీని నువ్వు ప్రమోట్ చెయ్యాలని బన్నీకి గట్టిగా చెప్పారు కూడా.
Also read: సమంత 'ఊ అంటావా మావ' సాంగ్ పై కోర్టుకెళ్లిన పురుషుల సంఘం!
"సుకుమార్‌దీ, నాదీ మ్యూచ్యువల్ అడ్మిరేషన్. ఒకరి సినిమాలకు సంబంధించి మరొకరం మెసేజ్‌లు పెట్టుకుంటూ ఉంటాం. తనదేమన్నా రిలీజైతే సుక్కూ అదిరిపోయిందని నేను, నాదేదైనా రిలీజైతే సర్ చింపేశారని తనూ కంటిన్యూస్‌గా చెప్పుకుంటూ ఉంటాం. తను పెట్టిన మెసేజ్‌లలో కంటిన్యూస్‌గా 'సర్, టైమ్ సరిపోవట్లేదు' అని పెడుతున్నాడు. ఒకరోజు దానికి, 'సుక్కూ.. జస్ట్ ప్రొడక్ట్‌లో నమ్మకం ఉంచు. నువ్వు చెయ్యగలిగినంత ఈ సినిమాకు చేసేయ్. ఎవ్విరిథింగ్ విల్ ఫాల్ ఇన్‌టు ప్లేస్' అని పెట్టాను. 'థాంక్యూ సర్' అన్నాడు. దానికి తగ్గట్లే పగలూ, రాత్రీ తేడా లేకుండా పనిచేస్తున్నాడు. నాకు కచ్చితంగా తెలుసు, సినిమా చాలా బాగా వస్తుంది." అని అన్నారు రాజమౌళి.
Also read: 'రానా నాయుడు' కోసం వెంకీ మామ కొత్త అవతారం!
ఆ తర్వాత అల్లు అర్జున్‌ను ఉద్దేశించి, "బాంబేలో ప్రతి ఒక్కరూ పుష్ప కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు దాన్ని ప్రమోట్ చెయ్యాలి. ఇంత మంచి ప్రొడక్టును నీ చేతిలో పెట్టుకొని, జనాలు ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రొడక్టును నీ చేతిలో పెట్టుకొని, అంత ఈజీగా దాన్ని పోనియ్యకూడదు. దీన్ని అక్కడ (ముంబైలో) కూడా నువ్వు కంప్లీట్‌గా ప్రమోట్ చెయ్యాలి. అక్కడున్నవాళ్లంతా ఈ సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఇందులో నా స్వార్థం, మన తెలుగు ఇండస్ట్రీ స్వార్థం కూడా ఉంది. పుష్ప కేవలం నీ సినిమా కాదు, ఇది తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్. ఎంత దూరం వెళ్లాలో, ఎంత పెద్దగా వెళ్లాలో వెళ్లాలి." అని సూచించారు జక్కన్న. సరేనన్నట్లు తలాడించాడు బన్నీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



