ఉదయ్ మానసిక చావుకి కారణం ఎవరు...?
on Jan 8, 2014
ఉదయ్ మానసిక చావుకి కారణం ఎవరు...? ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణం.. తను మానసికంగా, ఆర్థికంగా కృంగిపోవడమే కారణమని తెలుస్తుంది. అయితే అతను ఇలా అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య కారకుడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఉదయ్ మరణం ద్వారా ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నోరు విప్పని మాములు జనాలు సైతం వారి ఆవేదనని చెప్పుకుంటున్నారు. అయితే ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ కు మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కారణమంటూ ఇటీవలే ఓ న్యాయవాది పిటిషన్ వేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే ప్రముఖ నిర్మాత చెప్పిన మాటలకు చిరు కూడా ఒక కారణం అని అనిపించేలా ఉన్నాయి. ఉదయ్ తో రత్నం రెండు భాషల్లోను ఓ సినిమాను ప్రారంభించారు. ఆ సినిమా 80శాతం కూడా పూర్తయ్యింది. త్వరలో సినిమా విడుదల అవుతుందని ప్రకటించిన తర్వాత సినిమా ఆగిపోయింది. సినిమా ఆగిపోయిన ఏడాది వరకు ఆ నిర్మాత హైదరాబాద్ కు రాలేదు. ఆ తర్వాత ఆ నిర్మాత ఒక కార్యక్రమానికి రావడం వలన.. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందని అక్కడున్నవారు గుచ్చిగుచ్చి అడగడంతో అసలు నిజాన్ని చెప్పేసారు. "చిరంజీవి కాంపౌండ్ నుండి వచ్చిన ఒత్తిడి మేరకే సినిమాను అపివేయ్యాల్సి వచ్చిందని అన్నారు.
కానీ ఈ విషయాన్ని అప్పట్లో ఎవరుకూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. సినిమా ఇండస్ట్రీయే తన రాజ్యం కాబట్టి. టాలీవుడ్ కి చిరుయే మెగాస్టార్ కాబట్టి. ఈ విషయాన్ని చాలా చిన్నగా తీసుకున్నారు. కానీ నేడు ఉదయ్ మరణం తర్వాత ఇలాంటి వార్తలకు చిరు కూడా ఒక కారణం అని అనిపించే విధంగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.
ఏది ఏమైనా కూడా ఉదయ్ మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు కారణం అనేది త్వరలోనే తెలియనుంది. పోలీసులు ఈ కేసును అసలు విడిచిపెట్టే సమస్యే లేదని చెప్తున్నారు. అన్ని వైపుల నుండి ఇన్వెస్టిగేట్ చేసి, అసలు నిజాలు ఏంటో త్వరలోనే తెలియజేస్తాము అని చెప్తున్నారు.