ENGLISH | TELUGU  

ఉదయ్ మరణంపై పెరుగుతున్న అనుమానాలు...!

on Jan 6, 2014

 

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కు కారణాలు ఇంతవరకు తెలియకపోయినప్పటికీ... ఈ మరణం వెనుక చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సినిమా కెరీర్ బాగోలేదని ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరు అనుకుంటున్నారు. కానీ ఉదయ్ మరణం తర్వాత ఉదయ్ భార్య విశిత చెప్పినదానికి, ఉదయ్ తల్లిదండ్రులు చెప్పినదానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు.

 

తనకు బతకాలని లేదంటూ ఉదయ్ కిరణ్ తన భార్య విషిత దగ్గర చాలాసార్లు బాధపడ్డాడట. రెండు వారాల క్రితం నుంచి అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని, తన మూడ్ మార్చేందుకు విషిత తీవ్రంగా ప్రయత్నించిందట. నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నామని, జనవరి 2న హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు ఆమె తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రాలేదని... ఉదయ్ కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని...దాంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో విషిత వెల్లడించినట్లు తెలిసింది.

మరోవైపు...ఉదయ్ కిరణ్ తన తల్లిదండ్రులతో ఆరేళ్లుగా మాట్లాడడం లేదని, తన ఆస్తులను తాము దుర్వినియోగం చేశామన్న అనుమానంతోనే మమ్మల్ని దూరం పెట్టాడని ఉదయ్ తండ్రి వీవీకే మూర్తి స్వయంగా వెల్లడించారు. కనీసం తను పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని కూడా తమతో చెప్పలేదన్నారు. తన కొడుకు ఆత్మహత్య వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు. తన కొడుకుకి హైదరాబాద్‌లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉదయ్ మరణంపై అనుమానాలు బాగానే పెరుగుతున్నాయి. పోలీసులు అన్ని వైపుల నుండి కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.