నాన్నంటే నాగార్జునలా ఉండాలి!
on Jul 4, 2016
కులాంతర, మతాంతర పెళ్ళిళ్ళు మన టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. అయితే.. త్వరలో జరగనున్న నాగచైతన్య-సమంతల మతాంతర వివాహం మాత్రం పరిశ్రమ పెద్దల దృష్టిని మాత్రమే కాక జనరల్ పబ్లిక్ ను కూడా బాగా ఆకర్షిస్తోంది. వీరి పెళ్లి విషయం మెచ్చుకోవాల్సిందే ప్రేమించిన నాగచైతన్యనో లేక ఆ ప్రేమను అంగీకరించిన సమంతనో కాదు, ఈ ఇద్దరి పెళ్ళిని అంగీకరించిన నాగార్జునని అంటున్నారు ఈ వ్యవహారాన్నంతా ఫాలో అవుతున్నవారు.
కులం, మతం అనే విషయాలను పట్టించుకోకుండా.. కేవలం తన కొడుకు ఇష్టపడ్డాడనే ఒకే ఒక్క కారణంతో.. ఎవరైనా ఏమైనా అనుకొంటారన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి వారిద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఒప్పుకోవడమే కాకుండా "మాకు ఆనందంగా ఉంది" అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు నాగార్జున దంపతులు. సో, ఇప్పటికే ప్రేమలో ఉన్నవాళ్లతోపాటు.. ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళందరూ "నాన్నంటే నాగార్జునలా ఉండాలి" అనుకొంటున్నారట!