పరమార్ధం- శైలజ మిత్ర
పరమార్ధం
- శైలజ మిత్ర
ఒక తలుపు తెరిచి ఉంచు.....
నిశ్శబ్దంగా నేను నిన్ను అనుసరించడానికి....
నీ దుఃఖాన్ని దాచి ఉంచు ......
నా సంతోషాన్ని నీతో పంచుకోవడానికి....
ఆశ నిరాశల మెరుపులకేం గాని ....
అనుకోకుండా నీ చుట్టూ తిరిగే....
అసంతృప్తి గదిలోకి ప్రసరించే....
మనసును కనబడనంత దాచేయి ...
పగిలిన గుండె ముక్కల ఫైనా
ఒక్కటంటే ఒక్క చిరునవ్వు...
మచ్చుకయినా కనబడని ....
ఆవేదనలకి.....
పగలు రాత్రి తేడాలుండవు....
ఆనందానికి.....
ఏదో ఒక్క క్షణం అంటూ ఉండదు.....
ఇన్ని వింత పోకడల్ని
విషాదాల్ని ....
తుడిచిన దైవాంశ సంభుతాన్ని...
అనుభవిస్తున్న తన్మయత్వం
శరీరం అంత వ్యాపిస్తే.....
అదే జీవిత పరమార్ధం .....



