ఆలోచించండి - బేబీవాండ
ఆలోచించండి
జి. బేబి వాండ

ఆకలితో అల్లాడిపోయే అనాధలు
చెట్లకింద జీవితాన్ని కొనసాగించే
అభాగ్యులు .....
రోజు, రోజుకీ విచిత్ర దృశ్యాలు
పట్టెడన్నం కోసం పరుగులు తీసే పేదవాడి
జీవితం కన్నీటి సంద్రంలో పయనిస్తుంది.....
అక్షరాలు దిద్దవలసిన సమయంలో
బాంధవ్యాల బరువును నెత్తిన మోస్తూ
ఆటపాటలతో ఆడుకునే సమయంలో
బాలకార్మికులుగా మారే చిన్నారి బిడ్డలు....
మరో ప్రక్క!పెంచిన ప్రేమను వదలి
పంచిన అనురాగాన్ని మరచి కన్నతల్లిదండ్రులను
వృద్దుల ఆశ్రమాలకు పంపించే కన్నీటి
సంఘటనలు.....
ఎప్పటికి అంతమగును,ఏనాటికి మాయమగును
ఆలోచించండి....!!



