పర్వాలేదు ప్రకృతి - కె. వెంకటేశ్వరరావు
ఫర్వాలేదుప్రకృతి
కె. వెంకటేశ్వరరావు
భూమి బ్రద్దలైందా?
ఇక్కడ ప్రేమికుని హృదయం ముక్కలైంది.
విశ్వాన్ని ముంచేసిన వరదలు?
ఇక్కడ పొత్తిళ్లల్లో బిడ్డను
పోగుట్టుకున తల్లి కళ్లలో
సముద్రాలు!
కీకారణ్యంలో దావాలనం?
ఇక్కడ పూరి గుడిసె పొయ్యిలో
వెలగని అగ్నికణం!
అతలాకుతలం చేసిన సుడిగాలి?
ఇక్కడ పంట చేలో
నేలకొరిగిన రైతుకూలి!
ఆకాశంలో కారు మబ్బులు?
ఇక్కడ రెక్కాడని కళ్ళలో దిగులు!
ఫర్వాలేదు ప్రకృతి!
కష్టాలను భరించడం మా సంస్కృతి!!
