కలలు అలలు - దాసరి సులోచనా దేవి
కలలు అలలు
దాసరి సులోచనా దేవి

నే కనే కలలకి రెక్కలు
కట్టుకుని పైపైకి ఎగురుతున్నాను
అది కల అని తెలుసు
కళ్ళువిప్పితే
క్రింద పడిపోతాను
రెక్కలు తెగిన పక్షిలా అని తెలుసు
ఉవ్వెత్తున లేస్తున్న
అలలు మానుకున్నాయా పైకెగయడం
విరిగి పడతాం అని తెలిసినా
అయినా అదే నయమనుకుంటా
విరిగినా కనీసం తీరాన్నయినా తాకుతాయి.
నేను పడినా
స్థానభ్రంశం కూడా చెందను
ఎందుకంటే నేనక్కడే
వుంటాను కాబట్టి(భ్రమలో)



