TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
మారిన దశ
అసలు జీవితం అంటే
ఆనంద ప్రవాహమని ఎవరన్నారు ?
అది ఏ ' ఏ.టి.ఎమ్ ' లో వెలువడుతుంది ?
సంఘర్షణల ముళ్ళేసుకుంటూ
డబ్బుల సంచుల ఎరువేసుకుంటూ
పెదవుల మీదికి లాగిన చిరునవ్వుతో
గడియారం ముళ్ళను నెట్టుకోవటమే కదా !
దహనమౌతూ వెలుగుల్ని నింపటమే కదా !
నిప్పుదోసిళ్ళతో నీరాజనాలివ్వటమే కదా !
అంత స్సీమల్ని వెలిగించని కర్పూరం
ఎంత కరిగినా ఏం లాభం ?
వయస్సు పొద్దువాల్దున్నప్పుడు
మనసు గదిలో ఏ మూలో చావుముల్లు...
నక్షత్రాల్ని మెరిపించాలంటే
వెన్నెల కురవాల్సిందే !
సూర్యుడు మండిపోవాల్సిందే !
ఆత్మ దగ్ధమైపోతున్నా
అస్తమయం తర్వాత కూడా
మరో దిక్కున ఉదయించాల్సిందే !
రచన - డా. సి. భవానీదేవి
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|