Facebook Twitter
పిచ్చి మనసు - దాసరి సులోచనదేవి

పిచ్చి మనసు

 

దాసరి సులోచనదేవి

 

kavithalu, pichhi manasu, dasari sulochanadevi


మబ్బులు కమ్మిన ఆకాశంలో

మనసు మూతి ముడుచుకుంటే

 

కారణం ఏంటమ్మా అంటే

చందమామ లాంటి చిన్నోడు

కనిపించినట్టే కన్పించి అంతలోనే

మాయ మయ్యాడు-మళ్ళీ ఎన్నాళ్ళకో వాడి

దర్శన భాగ్యమని భోరుమంటోంది ఆ పిచ్చిమనసు

 

వాడి కనుసైగకే జడలోని

మల్లె మొగ్గలు సిగ్గులొలుకుతున్నాయని

మురిసిపోతోంది-

వాడి నవ్వే వెన్నెలయిందంటోంది