Facebook Twitter
సాహితి రంగంలో సామ్రాట్

సాహితి రంగంలో సామ్రాట్

డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ

తెలుగు వారిలో ప్రతిభ వున్న ఆది నుంచి ప్రచారం మాత్రం తక్కువే. తను తలపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్న ధ్యాసే తప్ప పబ్లిసిటీ గురించి రవంత అయిన ఒక తెలుగు వ్యక్తికీ జాతీయస్థాయిలో గుర్తింపు రాలేదు. బ్రిటీష దొరలను ప్రాణాలకు తెగించి ఎదిరించిన ఎందరో వీరులున్నారు. వారి పేరు చెబితే తెల్ల దొరలు గజగజ వణికేవారు. ఐతే వారికినాడు జాతీయస్థాయిలో ఇతర నాయకులకున్నంత ప్రచారం లేదు. వైద్య, విద్య, సాంఘిక, రాజకీయ రంగాల్లో చరిత్ర సృస్టించిన మహామహులున్నారు.

అయితే వారికి తగినంత గుర్తింపు రాలేదు. దానికి కారణం తెలుగువారు ఏనాడూ ప్రచారాని కోసం ప్రాకులడలేదు. పైగా ఒక తెలుగు వాడికి పేరు వస్తే రెండోవాడు అతన్నినిరుస్తాహపరిచే అలవాటు ఉంది. ఈ తత్త్వం మిగితా ఏ భాషల వారిలో వుండి ఉండదు. ఇటువంటి వాతావరణంలో  పెరిగిన ఒక తెలుగు రచయితకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సాహితీ అవార్డు “జ్ఞానపీఠ్” లభించింది. ఆ మహారచయిత సన్మాలకీ, సత్కరాలకి, అవార్డులకీ, రివార్డులకి ఎప్పుడు ప్రయత్నించలేదు పైగా మండి పడేవారు. అయితే ఆయన ఆనందించిన సాహిత్యం అజరామరమైంది.

తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన ఆ మహా కవి పేరు కవి సామ్రాట్ డాక్టర్ విశ్వనాథ్ సత్యనారాయణ. తెలుగు వారిలో జ్ఞానపీఠ్ అవార్డు మొట్టమొదటనందుకుని పద్మభూషణ్ బిరుదుపొంది , కళప్రపూర్ణ బిరుదు స్వీకరించి గౌరవ డాక్టరేట్ సత్క్రుతులైన మహాకవి సామ్రాట్ ఆయన. 

మన కథనాయకుడు సత్యనారాయణ విద్యాబ్యాసం బందరులో జరిగింది.చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి ఆశీస్సులతో బి.ఏ దాక చదివారు. అయితే చివరి సంవంత్సరం చదువుతుండగా, సహాయక నిరాకరణ ఉద్యమానికి మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు నందుకుని చదువు చాలించి, కొంతకాలం ఉద్యమంలో పాల్గోని, బ్రిటీషూ దొరలకు వ్యతిరేకంగా పాటలు, పద్యాలూ రచించి యువతరానికి అందించాడు.

విశ్వనాథ వారి జీవితం చెళ్లపిళ్ల వారి గురత్వ భాగ్యంతో ఒక మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. వారి మిత్రులైన కంభంపాటి రామమూర్తి శాస్త్రిగారి దగ్గర సంస్కృత వ్యాకరణం నేర్చుకొని నరసింహశాస్త్రీ గారి దగ్గర వేదాంత ప్రకరణాలను అబ్యాసించారు. గుంటూరులోని శ్రీ కల్యానంద భారతి మంతచార్యుల దగ్గర ఉపనిషత్తులు పటించి ఆంధ్ర సంస్కృతిక ఆంగ్ల భాషల్లోప్రసిద్దమైన గ్రంధాలన్ని చదివారు. నన్నయ తిక్కన,పెద్దన, తెనాలి రామకృష్ణ, కృష్ణదేవరాయ, కాళిదాసుభావభుతుల రచనలు వారికీ కరకతలామలకం అయ్యాయి పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి రచయితగా గుర్తింపు పొందారు.

విశ్వనాథ  సత్యనారాయణ ఏం.ఏ.పూర్తిచేసి మొదట బందరులో, తర్వాత గుంటూరులో ఏ.సీ. కళశాలలోను తెలుగు లెక్చరర్ గా చేరారు. ఉద్యోగంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒత్తిడి ఉన్నాసాహిత్యం పట్ల గల అభిమానంతో రాత్రి సమయాలలో సాహిత్యాభిమానం కలవరందరికి సమావేశపరచి తను రాసినవి వినిపించి వారి చేతకూడా రాయించేవారు. ఆవిధంగా వారి ప్రోత్సహంతో రచనలు చేసిన వారు ఎందరో ఈనాడు మహాకవులయ్యార.

విశ్వనాద వారు గుంటూరు విడిచి విజయవాడ కళశాలలో చేరారు. ఆ కాలంలో ఆయన ఆంధ్రప్రదేశం నలుమూలల్లో పర్యతిన్ పర్యటిస్తూ అనేక సాహిత్యోపన్యాసాలు ఇస్తూ మహాకవిగా విమర్శకుడిగా, ఆచార్యుడిగా ఆయన రచనల్లో వేయిపడగలు, రామాయణం, మహావృక్షం, కిన్నెరసాని, ఆంధ్రప్రశస్తి, నర్తనశాల ఏకవీర,అనార్కలి,ఋతు సంహారం,విశ్వనాథ మధ్యాక్కరలు, వీరవల్లిడు, హహహుహూ,ఝాన్సీరాణి,గోపిక గేతలు,కృష్ణ సంగీతంకోకిలమ్మ పెళ్ళి, శివార్పణం,ఆంధ్ర పౌరుషం, మాస్వామి,చెలియలి కట్ట, స్వర్గానికి నిచేనలు, కేదార గోళ, భ్రష్టయోగి బాగా పేరు తెచ్చాయి.

చరిత్రకారులు అంచనాప్రకారం ఆయన ఇరవైవేలకు పైగా పద్యాలూ ,మూడు వందలకుపైగా ఇతర రచనలు అంటే నవలలు, నాటికలు నాటకాలు రాసారు. విశ్వనాథ మధ్యాక్కరకు సాహిత్య అకాడమీ అవార్డు శ్రీమద్రామాయణ కల్పవృక్షంకు  జ్ఞానపీఠ అవార్డు  లభించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

శాసనమండలిలో సభ్యత్వం మిచ్చి గౌరవించింది. కవిగా కధానాయకుడుగా నవల రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడిగా, మహావక్తగా, కావ్య గాయకుడిగా సుమారు అరవై సంవత్సరాల పాటు తెలుగువారి హృదయాలను రంజింపచేసి కవి సామ్రాట్ అనే బిరుదును ప్రజల నుంచి పొందిన మహామనిషి విశ్వనాధ్. అందువల్లే ఆయన కవి సామ్రాట్ అయ్యారు.