Facebook Twitter
నన్నయ

నన్నయ

 

తెలుగు భాషలో ఆది కవి నన్నయ. ఈయన 11 వ శతాబ్దానికి చెందిన వారు. సంస్క్రుతాంధ్ర భాషలయందు విశేష పాండత్యం కలవారు. సంస్క్రుత మహాభారతాన్ని శ్రీ మదాంధ్రమహాభారతం అంటూ తెలుగు లో రచించిన కవిత్రయంలో మొదటి వారు నన్నయ గారు. ఆంధ్ర శబ్దచింతామణి కూడా రచించారు. ఆది కవిగానే కాకుండా శబ్దశాసనుడు వాగశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతులయ్యారు. 

ఆది కవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్నపేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు. ఈయన వేగిదేశమేకి రాజైన విరాట్ కు ఆస్ధాన కవి. నన్నయ మహాభారతాన్ని తెలుగులో రాయటం మొదలు పెట్టి అందులో మొదటి రెండు ఆది, సభా పర్వాలనుపూర్తి చేసి తరువాతి అరణ్యపర్వాన్ని 141 పద్యం వరకూ  రాసి కీర్తి శేషుడయ్యారు. తెలుగు భాషకు అద్భుతమైన మార్గాన్ని నిర్దేశించారు. 

తల్లి గోదారి ఒడ్డున కూర్చొని తన రాజయిన రాజరాజ నరేంద్ర మహారాజు గారికి చెప్పినదే ఈ మహాభారతం. దీంతో పాటు ఈయన చాముండికా విలాసం, ఇంద్రవిజయం ఆంధ్రశబ్దచింతామని అనేసంస్క్రుత వ్యాకరణ గ్రంధాన్ని కూడా రచించారని అంటారు. 

పాణిని పద్ధతికి విరుద్ధంగా వ్యాకరణాన్ని ఐదు విభాగాలుగా నన్నయ విభజించారు.  ఆది కవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అనుపేర్లతో ఆయన ప్రఖ్యాతులయ్యారు. తెలుగులో ఇవాళ మనం భారతాన్ని చదువుకుంటున్నామన్నా అర్ధాలు తెలుసుకోవటానికి శబ్దచింతామణి చదువుకుంటున్నామన్నా అంతా నన్నయగారి కృషి ఫలితం...అందుకే ఆది కవి నన్నయ గారికి వందనాలు సమర్పిస్తూ... తెలుగు వారం అందరం మొక్కుకుందాం....