'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
'ఆమె'
- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
కలయికలో ఎడబాటుంది
ఎడబాటులో విరహం వుంది
కలయిక ఎడబాటుల మధ్య
జీవితం కొట్టుమిట్టాడుతుంది
ఒంటరి హృదయంలోకి
నడిచొస్తావు కలగా!
తుంటరిగా మారుస్తావు బ్రతుకును
నందనోద్యానవనంగా!!
ఆకాశం మేఘావృతమయింది
నా శూన్య హృదయంలా!
అడ్డంగా తళుక్కుమంది
నీ ప్రేమ స్మృతిలా!!
చేలు సరే...పూలు సరే...
చెలి ఏదీ ప్రక్కన?
ఏకాంతం ఎందుకు మరి
చేర్చుకోందో అక్కువ??
రాజీపడడం కొంతసేపు.
రాద్ధాంతం కొంతసేపు
ప్రేమంటే అంతే ప్రియతమా...
రసవత్తర శృంగార నాటకం!!
సశేషం



