యుద్ధం ముగింపు- పి జానకి
యుద్ధం ముగ్గింపు
పి. జానకి
నారుపోసి, నీరు పోసి,
వలసినంత ఎరువువేసి,
ఎంత శ్రమను వెచ్చిస్తే-
ఒక వృక్షం ఫలిస్తుంది.
మనసు పంచి తనువు పంచి
బ్రతుకంతా మమత పంచి
ఎంత ప్రేమ పంచి ఇస్తే-
ఒక హృదయం లభిస్తుంది?
నదుల నీరు, చెరువు నీరు,
కంటిలోని కన్నీరు-
ఎంత నీరు ఆవిరైతే-
ఒక వర్షం కురుస్తుంది.
ప్రజలు పోయి, ప్రభువు పోయి,
ఆక్రమిన్చిహారులుపోయి,
ఎంతమంది కనుమూస్తే-
ఒక యుద్ధం ముగుస్తుంది?
