ఏముంది పల్లెల్లో.... ప్రేమానురాగం ఉంది
ఏముంది పల్లెల్లో....నాకు నువ్వు, నీకు నేను అనే భరోసా ఉంది
ఏముంది పల్లెల్లో....చిన్నప్పటి ఆట పాటలు
ఏముంది పల్లెల్లో....పెద్దా- చిన్నా మర్యాదలు
ఏముంది పల్లెల్లో....అరమరికలు లేని జీవితం
ఏముంది పల్లెల్లో.....అణిగిమణిగే మనస్తత్వం
ఏముంది పల్లెల్లో..... మంచి -చెడు భేదం చెప్పే పెద్దలు
ఏముంది పల్లెల్లో....మరువలేని బంధుత్వం
ఏముంది పల్లెల్లో....మధుర ఙ్ఞాపకాలెన్నో
ఏముంది పల్లెల్లో.... పచ్చని పొలాలు
ఏముంది పల్లెల్లో....పైర గాలులు
ఏముంది పల్లెల్లో....చందమామ కథలు
ఏముంది పల్లెల్లో.... సంతలో బెరసారాలు
ఏముంది పల్లెల్లో....జాతరలు
ఏముంది పల్లెల్లో.... మమతానురాగాలు
ఏముంది పల్లెల్లో.... కాబోయే వధూవరుల తీపి జ్ఞాపకాలు
ఏముంది పల్లెల్లో.... కొత్త అల్లులకు మర్యాదలు
ఏముంది పల్లెల్లో.... సరికొత్త అనుబంధాలకు ఆహ్వానాలు....
ఏముంది పల్లెల్లో.... మదిలో పెనవేసుకు పోయే కథలు
ఏముంది పల్లెల్లో.... విడిపించుకోలేని సత్సంబంధాలు
పల్లెల్లో అన్నీ ఉన్నాయి...
పల్లెల్లో మనుషులకు మానవత్వం ఎక్కువ...
పల్లెల్లో అనురాగం ఎక్కువ....
పల్లెల్లో జనం సరైన సదుపాయాలు లేక పట్నం వైపు పయనమైపోతున్నారు....
పల్లెల్లో తమ వాళ్ళను వదిలి...తమది కాని ఊరిలో పరాయి వాళ్ళుగా బ్రతుకు ఈడుస్తున్నారు....
పల్లెలు....బోసిపోతున్నాయి
పల్లెలు....మారిపోతున్నాయి
పల్లెలు...మారితే...
మనకు పూర్వ వైభవం ఎలా వస్తుంది...
మళ్ళీ పల్లెలు ....
పచ్చని పైరుతో కళకకళకళలాడుతూ...
ధాన్యం ప్రతి ఇంటా రాసులుగా పోసి పండుగలు చేయాలి....
..బంధువులంతా ఇంటి నిండా చేరి పెద్దల ఆశీర్వాదాలతో నిండు నూరేళ్ళూ హాయిగా బ్రతకాలి.....
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు
మన పల్లెలను కాపాడుకుందాం
