Facebook Twitter
ద రోడ్ నాట్ టేకెన్!

నిలువునా చీల్చిన పచ్చటి చెక్కలా ఆ రెండు మార్గాలు
క్షమించండి.. నేను ఆ రెండు మార్గాల్లోనూ ప్రయాణించలేను
ఒక్క మార్గంలోనే నేను నిరంతరం నిలబడే వున్నాను
ఒకచోట అకస్మాత్తుగా మార్గం ఒంపు తిరిగింది
మార్గం కనిపించినంత వరకు చూస్తున్నాను

ఇప్పుడు మరో మార్గంలోకి ప్రవేశించాను
ఈ మార్గం ఏదో కాస్తంత బాగుందని అనుకున్నాను
పచ్చటి గడ్డితో ఆహ్లాకరంగా వున్న మార్గం ఇది
ఈ మార్గంలో వెళ్తే గమ్యాన్ని చేరుకుంటానని అనుకున్నాను
నేను అనుకున్నట్టే జరుగుతుందని ఆశిస్తున్నాను

కానీ, నేను ఆ మార్గంలో కూడా ప్రయాణించలేదు
నేను ఎక్కడైతే వున్నానో అక్కడే వున్నాను
ఇప్పుడు మళ్ళీ మొదటి మార్గం గురించి ఆలోచిస్తున్నాను
మొదటి మార్గంలో ఆ మలుపు తర్వాత ఏమి వుంటుందో
తిరిగి ఎప్పుడు వెనక్కి రావాలా అనే ఆలోచనలో వున్నాను

-రాబర్ట్ ఫ్రోస్ట్ (1874-1963)