ప్రతాప్ కౌటిళ్యా
అతి మృదువుగా తాకిన పూల రెమ్మల స్పర్శలో
చెట్టు మట్టిలోకి పాకి ముని వేళ్ళల వేళ్ళను ముద్దాడీ
ఒక్కో మట్టి రేణువు అణు వు అణువున పులకరించి నా సంకేతంతో తనువు తనపై
ఎగిరేసిన పచ్చటి జెండాను వదిలేసి
చల్లని గాలి వలువలు ఊడదీసి నట్లు విడివిడిగా విడిపోయి ఆకాశమార్గ ద్వారాన్ని మూసి వేసి మత్తుగా అక్షయపాత్ర లోని మధువును తాగేసిన పుప్పొడి రేణువులు వేలవేల వేణువై గానం చేస్తున్నట్లు
చెట్టు మొత్తంగా తలకట్టు ను నడుము చుట్టూ చుట్టుకున్న లేత చిగురుల పొగరు ఒకవైపు
చిరునవ్వుల కొమ్మల సందుల్లో దూరిన నిన్నటి పుష్పం ఒకటి ఒకటే కొంటే చూపుతో సిరిసిరిమువ్వల శబ్దంతో చెట్టంతటీ మగసిరినీ ఊపిరి పీల్చకుండా చేసి
రాత్రి తో తలస్నానం చేసి వెన్నెల్లో కురులు ఆరబోసుకున్న సుకుమారులు ఆ విరులు సువాసనల సుమాలు వనంలో ఓనమాలు దిద్దిన ట్లు ముద్దులతో నుదుటీ పలకపై అక్షరాభ్యాసం చేసి అర్థనగ్న ముగ్ద విరహ అద్దం లో
మెలికలు తిరిగిపోతుంటే ఒకానొక నీటి చుక్క ఆత్మబంధువు ల నీటి బిందువై నుదుట మెరిసి
విరిసిన పూల ఇంద్రధనుసు లా
వినిపించని కలవరింతలు కనిపించని కలలూ
కొలనులోని కన్యా కలువలు పలుకరింతలతో
సుతిమెత్తగా ఒళ్లంతా ఆక్రమించిన చన్నీటి స్నానం భ్రమ రాలు ప్రియురాలి కై తపించిన ఏకైక కేకలు వినిపించెనే లేదేమో
ఒళ్లంతా త్రుళ్ళీపడి ఒదిగి కరిగిపోయిన ఆ కన్య వనంలో పైనుంచి ప్రేమించీఎన్నెన్నో లోకాల్ని ఈదీ
దాటీ వాటిపై కురిసిన వాన చినుకులు ఇప్పుడు సంపూర్ణంగా కలిసి చెట్టును మట్టిలోకి మట్టిలోంచి చెట్టు ను బయటకు పుట్టించి
మట్టిలో చెట్టు ల కలిసిపోయిన ఆ రతీదేవి నీ నేనేనంటూ పిలిచిన లేత మొగ్గల మొదళ్లలో
మెరిసిన ఆ సున్నిత నీటి బిందువులు
రేపటి తోటలో రాలిపోయే పూల ఇంద్రధనస్సులు?
వేల సూర్యుళ్లు పూసిన తోటలో
వేల చందమామలు పూల భామల కోసం
ఆకాశం నుంచి దిగి వస్తున్నాయి
ఆ సమాచారం అప్పుడే తారలకు చేరింది ఏమో
భూలోకమంతా నక్షత్ర తోట అయింది?!!!?
- Pratap Koutilya
