Facebook Twitter
మసులుకో...

ఈ గుంజాట ఇంకెన్ని రోజులో
పడుతూ... లేస్తూ...
వేసుకున్న రంగులు తుడుచుకుంటూ
తుడుచుకున్న రంగులు వేసుకుంటూ
ముక్కలైన సూర్యుడిలా
 బ్రతకడం, అంతలో చావడం

అగ్గిపుల్ల తలకు
ఒక చిన్న నవ్వునో, నవ్వులాంటి తడినో
వెలిగించాలి...
రాపిడి జరిగే చోట
మొక్కను నాటి, మట్టిని ఒత్తుగా చేసి
ఒక ఆనకట్ట కట్టాలి

ఒక పక్క నుండి సర్దుకుంటూ
మరో పక్క నుండి
అప్పుడెప్పుడో
ముఖం నుండి రాలిపోయిన
ఎమోషన్స్ ని
బలవంతంగా కూర్చోబెట్టుకుంటూ
ఈదడం నేర్చుకోవాలి

పదే పదే తలుచుకుంటూ
తలుచుకున్న విషయ తీగను
తెంపుకుంటూ
ఒక చోట మరణిస్తూ
మరోచోట జీవిస్తూ
కాలపు పొయ్యి గడ్డపై
సగం విరిగిన చంద్రుడిలా;
 జొన్నరొట్టె.

శరీరం
అప్రయత్నంగా మసలినట్టు
లేదా మసలినట్టు నట్టించినట్లు
ఆలోచనలు కూడా మసలాలి...
లేదంటే
అగ్గిపుల్ల రోధిస్తుంది
జొన్నరొట్టె- పాములా కదులుతుంది
ఆనకట్టకు తూము పడుతుంది
రంగు వెడలిపోతుంది
అంతటితో
ఈత ముగుస్తుంది

లై