
మారుతున్న కాలగమనంలో
మానవ మనుగడ ఎలా?
ప్రాణం నేడొక గాలిలో దీపం!
చేతులడ్డుపెట్టి కాపాడే నాథుడే కరువాయే!!
కరుణ కనిపించని లోకమిది
ఎంత భ్రమసినా అది అగమ్యగోచరమే
కరుణలేకనే తరువులన్నీ నరికిన మనిషికి
నేడది దొరకని సరుకయ్యి
ఊపిరిదొరకక ఊపిరితిత్తులు ఉసూరుమంటూ మనిషిని సాగనంపుతున్నయ్!
కళ్ళముందే రాలిపోయే దేహాలు!!
చిన్నా పెద్దా తేడాలేదు
ఐశ్వర్యమెంతున్నా గాలాడని గందరగోళం
మనిషి రక్షణగోడలులేని ఆక్రమణకు దారి
ఇల్లు కూలిపోతున్నయ్
మనుషులు మాయమైతున్నరు
క్షణం క్షణం భయం భయం
గుండెల్లో కనపడని వేధనా
కరోనా అకాల దాడిలో సామాన్యులెందరో సమిధలౌతున్నరు
ఊళ్లు నగరాలు అన్నీ
శ్మశానాలు ఆరని మంటలకు ఆనవాళ్లు
కనిపించని దుఃఖాన్ని దిగమింగుతున్న హృదయం
విశ్వమంతా నేడెక్కడైనా చావుమేళాల వేడుకలు
ఎక్కడి దారులక్కడ మూసుకుపోయి
అవకాశాలు అదృష్యమైపోతుంటే
గాలిదొరకని దారుల్లోకి పయనమైనట్టుంది.
.jpg)
సి. శేఖర్(సియస్సార్)



