నాన్నతోడుంటే
నాన్నతోడుంటే
నాన్న పక్కనుంటే చాలు
కొండంత ధైర్యం గుండెనిండి
ఏదైనా అలవోకగా సాధించే
అడుగేసి అందుకోవచ్చు
నాన్నంటే ప్రేరణకు చిరునామా
నాన్నకు నవ్వులు పంచడమే తెలుసు
పరిస్థితేదైనా మనసులో దాచుకుని
చిరునవ్వుతో ఎదిరించే నైపుణ్యం నాన్న సొంతం
కష్టాలెన్నున్నా గడపవతలే వదిలేసి
ఆలుపిల్లలకు ఆనందం పంచేవాడు
బిడ్డల భవిష్యత్తుకు అందమైన రూపమిచ్చేవాడు
బిడ్డలు గమ్యం చేరేందుకు తానో నిచ్చెనౌతాడు
శిఖరం చేర్చే దారవుతాడు మనసులోనే
విజయానందం పొందేవాడు
త్యాగానికి తరువువంటివాడు
జీవితం నేర్పే గురవు నాన్న
తన తనువులోని అణువణువు బిడ్డలకోసమే
త్యాగంచేసే మనసు
అందుకే
ఆయన స్థానమెపుడు గుండెల్లోనే
ఈ తనువున్నంతవరకు ఆదర్శం నాన్న
సి. శేఖర్(సియస్సార్)
