కొత్తవ్యవస్థ - కె. వెంకటేశ్వరరావు

కొత్త వ్యవస్థ   కె. వెంకటేశ్వరరావు     కుక్కలు చింపిన విస్తళ్ళ లో ఎందమవుల్లాంటి ఎంగిలి మెతుకులకై చెత్తకుండిల దగ్గర బక్క చిక్కిన భావి పౌరులు!   లక్షల కట్నాలు సమర్పించుకొన్నా సలక్షణమైన సంసారానికి నోచుకోలేక అత్త వారిళ్ళలో అగచాట్లు పడే ఆడపిల్లలు!!!   చదువుల్లో గోల్డ్ మేడలిస్తులైన కుల విభజన పట్టికలో పేరులేక ఎక్స్చ్ం జిలలో యమ నూతనాలుపడే నిరుద్యోగులు!!!   కడుపు మండితే విప్లవాగ్ని! కడలి మండితే బడభాగ్ని!! అడవి మండితే దావాగ్ని !!! ఈ మంట విస్పోటంలో దగాపడిన తమ్ముళ్ళు! చెల్లెళ్ళు!! దండుగా ఉద్యమిస్తే యువత భవితకై ఓ కొత్త వ్యవస్థ ఉద్భవం తధ్యం!!

జీవితం - సామర్ల లక్ష్మీరాజ్

జీవితం   సామర్ల లక్ష్మీరాజ్     భళ్ళుమన్న విస్పోటనం! ఎక్కడో సాగర మధ్యనో లేక నగరం నడిబోడ్డునో కాదు. ఇక్కడే నా గుండె లోతుల్లో   ఓడభాగ్ని జ్వాల రగిలి ఎగిసి వువ్వెత్తున వుబికి నన్ను మున్చేస్తోంటే.. ఫైకి మాత్రం సముద్రం లాంటి నిశ్శబ్దంలో కాటుకలాంటి చీకటి కప్పుకుని   భయం కౌగిలిలో అభద్రతాభావంతో వెక్కి వెక్కి పడుతున్నాను! అవును! నాకీ శాస్తి జరగాల్సిందే!! జీవితాన్ని అందిస్తానని ఎడడుగులు పంచుకుంటే   నిర్ధక్షిణ్యంగా కన్నీళ్ళ సాం ద్రంలో నెట్టేసి పోయావు!! ఏది నా అస్తిత్త్వం? ఎక్కడా ఓ ఆలంబన దొరక్క... తల్లడిల్లి అల్లాడిపోయి నిస్సహాయనైపోయాను నాకు బ్రతకాలని వుంది! ఓ అస్తిత్త్వమా ?!కాస్త చేయి అందించి వూత మియవూ......!!    

వెన్నెల కురిసిన రాత్రి - బేబీవాండ

వెన్నెల కురిసిన రాత్రి    బీబి వాండ     వెన్నెలకురిసిన రాత్రిలో నైట్ క్విన్ పుష్పాలు నవ్వుల కాంతులను కురిపిస్తున్నాయి..! పచ్చటి పకృతిలో చల్లతిగాలులు   తెల్లటి వెన్నెల అందచందాలను మధురంగా తాకుతున్నాయి.....! నింగిలో మెరుస్తున్న తారలు చంద్రుని అందానికి పరవశించి   తియ్యటి రాగాలు అలపిస్తున్నాయి ....! మదిలో మెరుస్తున్న ఓ మోహనరాగం కృష్ణశాస్త్రి కంతలోకంలో పయనించి గోదారి అలలఫై నాట్యమాడి .   మరుమల్లెల బృందావనాన్ని ముద్దాడింది...! పకృతి సౌందర్యాన్ని హత్తుకుంటూ వెన్నెల కురుస్తుంది   నైట్ క్విన్ పుష్పాలు నవ్వుల కాంతులను కురిపిస్తున్నాయి..!!    

పరితాపం- అపర్ణా ఫణికూమార్

పరితాపం   అపర్ణా ఫణికుమార్     ప్రియతమా! వెండికొండల అంచున మధురోహల తోలివెన్నెల కురిసేవేళ శిధిలమైన కోవెలలా ఉన్న నామనసు పొరల్లో పారిజాతపు పరిమళంలా అలుముకున్నది నీరూపు , పరితాపం నా మనోహర్ ఆలోచనా విహంగాల గమ్యం నీవేనని, నా మదిలో ఎగిసిపడుతున్న భావాలకు ఆకృతి నీవేనని నీకు తెలుసా!   నీకనురెప్పల నీడలో... నీకనుపాపల ఊయలలో నిశ్చింతగా, నిర్భితగా నిదురించాలానే నాకోరికను కాదనుకుమా ...   నా ఎదలోతుల నుంచి పొంగిపోరలుతున్న ఈ మాటలకందని భావాలను అక్షరకృతినిచ్చి నీ మనసులోని అనురాగాన్ని నీకు అర్పించాలని ఎంతో ఆశపడుతున్నా,నీ తలపులతో తపిస్తున్నా   నీ మాటే నాకు వేదం, నీవే నా ప్రాణం నీ ప్రేమ లేకుంటే నా మనుగడే అగమ్యగోచరం.

నిన్ను మార్చేదాకా - చిమ్మపూడి శ్రీరామమూర్తి

నిన్ను మార్చేదాకా...........   చిమ్మపూడి శ్రీరామమూర్తి   మోపెడు సహనాన్ని నా తల మీద ఎత్తి మోజులు తీర్చుకునే పశువు నువ్వు. ఇప్పుడు నేనో నెత్తురు చిరునామాను. నా శవాన్ని నేను చూసుకునేదాకా వదల్లేదు నువ్వు.   మూడు ముళ్ళ చితి మీద అమ్మా-నాన్నా పడుకోబెట్టినప్పుడే అనుకున్నా- కోరికలతో నువ్వు రెడీగా వుంటావని. బుసకొట్టే కోరికల పాముల నన్ను చుట్టేస్తుంటే నాలోని నన్ను చంపెసుకున్నా. నా నిరీక్షణ కన్నీళ్ళ మీద కాగితప్పడవై నన్ను వెక్కిరిస్తూనే వుంది.   ఈ కీర్తి కిరీటాలు, కలికితురాయిలు నాకెందుకు? నువ్వే తీసుకుపో. నలుడిలా, హరిశ్చంద్రుడిలా,ధర్మరాజులా నువ్వూ ఓ మగాడివే! నా ఊహల నుంచి జారిపోతున్న ఆశను ఇంధనం చేసుకున్నావు.   రిజర్వేషన్లు, వాక్కులూ, బిల్లులూ, కోటాలు.....వట్టి ట్రాష్. ఆపద్దర్మంగా నువ్వు జపించే మంత్రాలం. ఇప్పుడు నాదారి నిండా ఉద్యమాన్ని పరుచుకున్నా నేనిప్పుడు అక్షరాల వెలుగు నీళ్లతో ముఖం కడుక్కున్నా, నిద్రపోను నిన్ను మార్చేదాకా....

ఆలోచించరూ! - చిల్లర భవానీదేవి

ఆలోచించరూ!   చిల్లర భవానీదేవి   ఇంక తెగిన ఈ దారం కోసలతో రెండు దృవాలను నా లేత చేతులతో ముడి వేయలేను యుద్దాలు దేశాలమధ్యే కాదు గడప లోపల మౌనాయుధాలతో కూడా జరుగుతుంటాయి   ఎడమొహం పెడ మొహాల మధ్య ఏకాకి నావ నా బతుకు వాదంవాదాల మధ్య మూసినా పుస్తకం నా బాల్యం   కలహాల కన్నీళ్ళ మధ్య కోర్టు నిర్ణయం నా కస్టడీ జన్మ నిచ్చిన ఇద్దరిలో ఒక కన్నే నేనిప్పుడు ఎంచుకోవాల్సింది!   మనసును వరించే నల్లకోట్ల కధనాలే అన్నీ! పోరుని పెంచే పగముసుగుల పావులే అన్నీ! ఇందరి కళ్ళలో జాలి నాకోసమేనా....? అందరి హేళనా తిరస్కారాలు నాకు బహుమానాలా?   పోరును ప్రోది చేసే నల్లకోట్ల తోడేళ్ళ హాసాలలో భావి చూపుల రెక్కలు విరిగిన పసిపావురాన్ని జీవితకాలంపాటు పగుళ్ళ లేబుల్ ను అతికే అమ్మానాన్నల్లారా ఒక్కక్షణం నా గురించి నిజం గా ఆలోచించారా?!

పర్వాలేదు ప్రకృతి - కె. వెంకటేశ్వరరావు

ఫర్వాలేదుప్రకృతి                                                                                                                                                 కె. వెంకటేశ్వరరావు                                                              భూమి బ్రద్దలైందా? ఇక్కడ ప్రేమికుని హృదయం ముక్కలైంది.   విశ్వాన్ని ముంచేసిన వరదలు? ఇక్కడ పొత్తిళ్లల్లో బిడ్డను పోగుట్టుకున తల్లి కళ్లలో సముద్రాలు!   కీకారణ్యంలో దావాలనం? ఇక్కడ పూరి గుడిసె పొయ్యిలో వెలగని అగ్నికణం! అతలాకుతలం చేసిన సుడిగాలి?   ఇక్కడ పంట చేలో నేలకొరిగిన రైతుకూలి! ఆకాశంలో కారు మబ్బులు? ఇక్కడ రెక్కాడని కళ్ళలో దిగులు! ఫర్వాలేదు ప్రకృతి! కష్టాలను భరించడం మా సంస్కృతి!!

కర్షకుల జీవనం - కొమురయ్య

కర్షకుల జీవనం                                                                                                                                                                       ఎ.కొమురయ్య    పల్లెవాసులం పసి మొక్కలకు ప్రాణం పోసెడి జీవన దాతలం.   రెక్కలు ముక్కలుచేసుకుని మా డొక్కలనంటగట్టుకుని మా రక్తాన్ని చెమటగా మార్చి సేద్యం చేసే శ్రమ జీవులం.   దుక్కులు దున్ని మొక్కలు నాటి మొక్క మొక్కకు నీరందించి పైరు పంటలే ఎన్నో తీసిన   పల్లె సీమకే ముద్దు బిడ్డలం. పల్లె దొరలకు బానిసలమై పట్నం దొరలకు దాసులమై బడి బాసండ్లెన్నో తోన   బ్రతుకు సాగని బడుగు జీవులం. అప్పుల కోసం తిప్పలు బడుతు మండుటెండలో మలమల మాడి రేయిపగలు కష్టం చేసి   మంచి నీళ్ళతో కడుపు నింపుకుని ఆకలి మంటల నదుర గొట్టిన మేం అన్నపూర్ణకే సవతి బిడ్డలం. పుడమి తల్లితో పోరాడి   భూమాత మెప్పుల పొంది పుడమినుంది పసిడి తీసిన ప్రతిభావంతులం. పుట్ల కొద్ది పంటలు దీసి పండిన పంటను పట్నం బంపి   ప్రజా క్షేమమే మా ధ్యేయమని ప్రజా శ్రేయస్సుకై అంకితమైన కపట మీరుగనీ కష్టజీవులం.