కొత్తవ్యవస్థ - కె. వెంకటేశ్వరరావు
posted on Jan 10, 2012
కొత్త వ్యవస్థ
కె. వెంకటేశ్వరరావు
కుక్కలు చింపిన విస్తళ్ళ
లో ఎందమవుల్లాంటి ఎంగిలి మెతుకులకై
చెత్తకుండిల దగ్గర బక్క చిక్కిన
భావి పౌరులు!
లక్షల కట్నాలు సమర్పించుకొన్నా
సలక్షణమైన సంసారానికి నోచుకోలేక
అత్త వారిళ్ళలో అగచాట్లు పడే ఆడపిల్లలు!!!
చదువుల్లో గోల్డ్ మేడలిస్తులైన
కుల విభజన పట్టికలో పేరులేక
ఎక్స్చ్ం జిలలో యమ నూతనాలుపడే
నిరుద్యోగులు!!!
కడుపు మండితే విప్లవాగ్ని!
కడలి మండితే బడభాగ్ని!!
అడవి మండితే దావాగ్ని !!!
ఈ మంట విస్పోటంలో
దగాపడిన తమ్ముళ్ళు! చెల్లెళ్ళు!!
దండుగా ఉద్యమిస్తే
యువత భవితకై ఓ కొత్త వ్యవస్థ ఉద్భవం తధ్యం!!