తెలుగుతల్లి - శ్రీ సాయిధనవర్మ
posted on Jan 9, 2012
తెలుగుతల్లి
శ్రీ సాయిధనవవర్మ
తెలుగుతల్లికి ముద్దుల కొమరుణ్ణి
పదహారణాల తెలుగువాణ్ణి
తెలంగాణా అన్నా - రాయలసీమ అన్నా
కోస్తా ఆంధ్ర కన్నా - సర్కారుప్రాంతమెన్నా
ఎవరేమన్నా - నేనన్ని ప్రాంతాల వాణ్ణి
ఎగరేస్తా మన ఏకతా పతాక!
భాషలో మాండలిక భేదాలున్నా
భావనలో జాతి విభేదాలు లేవన్నా
మనం అంతా మాట్లాడేది తేట తెలుగన్నా!
మనలో మనకు మత భేదాలొద్దన్నా
మనమందరం కలిసి బ్రతుకుంటే మిన్న!!