దగాచేసిన 'ఆశ' - ఎన్ అజయ్
posted on Jan 9, 2012
దగాచేసిన 'ఆశ'
ఎన్. అజయ్
నువ్వంటే ఆశ.!
నీ మనసంటే ఆశ..!!
నీ నవ్వంటే ఆశ.!
నీ ప్రేమంటే ఆశ..!!
నా జీవితానికి గమ్యం, లక్ష్యం నీవే..!!
ఆస్తి ఆశయం నీవే..!!
సాగర కన్యను చూసినా-సంధ్యాదేవి చూసినా
శశిని చూసినా-చీకటిని చూసినా
గతంలో నాకొక ఆశ కనిపించేది.
కానీ.....
ఇప్పుడు ఆ ఆశ ఆశలేదు, నా ప్రేమను, నా ఆకల్ని,
నా కలల్ని, నా నమ్మకాన్ని దగా చేసి వెళ్లిపోయింది.