వెన్నెల కురిసిన రాత్రి - బేబీవాండ

వెన్నెల కురిసిన రాత్రి 

 

బీబి వాండ

 

 

వెన్నెలకురిసిన రాత్రిలో

నైట్ క్విన్ పుష్పాలు నవ్వుల

కాంతులను కురిపిస్తున్నాయి..!

పచ్చటి పకృతిలో చల్లతిగాలులు

 

తెల్లటి వెన్నెల అందచందాలను

మధురంగా తాకుతున్నాయి.....!

నింగిలో మెరుస్తున్న తారలు

చంద్రుని అందానికి పరవశించి

 

తియ్యటి రాగాలు అలపిస్తున్నాయి ....!

మదిలో మెరుస్తున్న ఓ మోహనరాగం

కృష్ణశాస్త్రి కంతలోకంలో పయనించి

గోదారి అలలఫై నాట్యమాడి .

 

మరుమల్లెల బృందావనాన్ని ముద్దాడింది...!

పకృతి సౌందర్యాన్ని హత్తుకుంటూ

వెన్నెల కురుస్తుంది

 

నైట్ క్విన్ పుష్పాలు నవ్వుల కాంతులను

కురిపిస్తున్నాయి..!!