ప్రేమదేవత - తంబూరు జగన్మోహన్

ప్రేమ దేవత

 

తంబూరు జగన్మోహన్

 

 

 

మనసులోని నీ ఆలోచనా మేఘాలు

అక్షర కుసుమాలు రాలుస్తుంటే,

నా మదిలో మెదిలే 'కంత'నీవు

ఎదనిండా నీ జ్ఞాపకాలు అలలు కదులుతూ...

 

హృదయాంతరాలల్లో నిక్షిప్తమవుతుంటే

నేను పాడే 'ప్రేమగీతిక'నీవు

ప్రపంచంలోని ప్రేమంతా

నీ రూపం సంతరిమ్చుకుంటే,

నా హృదయంలో కొలిచే 'దేవత' నీవు.