posted on Jan 10, 2012
సామాన్యుని జీవితం
-బి.ఎల్. ఎన్. సత్యప్రియ
కత్తుల
కటి చీకటిలో
కుత్తుకలని
చుంబిస్తుంటే_
నిశిరక్కసి
తన అధరాలకి
ఆ రుధిరాలని
అద్దుకుంది_
ముష్కరమస్తిష్కం
మానవతని
మసి చేస్తుంటే_
సామరస్యం
సామ్యవాదం
సామాన్యుని
వెక్కిరించాయి.