జీవితం - సామర్ల లక్ష్మీరాజ్
posted on Jan 10, 2012
జీవితం
సామర్ల లక్ష్మీరాజ్
భళ్ళుమన్న విస్పోటనం!
ఎక్కడో సాగర మధ్యనో
లేక నగరం నడిబోడ్డునో కాదు.
ఇక్కడే నా గుండె లోతుల్లో
ఓడభాగ్ని జ్వాల రగిలి ఎగిసి
వువ్వెత్తున వుబికి నన్ను మున్చేస్తోంటే..
ఫైకి మాత్రం సముద్రం లాంటి నిశ్శబ్దంలో
కాటుకలాంటి చీకటి కప్పుకుని
భయం కౌగిలిలో అభద్రతాభావంతో
వెక్కి వెక్కి పడుతున్నాను!
అవును! నాకీ శాస్తి జరగాల్సిందే!!
జీవితాన్ని అందిస్తానని ఎడడుగులు పంచుకుంటే
నిర్ధక్షిణ్యంగా కన్నీళ్ళ సాం ద్రంలో నెట్టేసి పోయావు!!
ఏది నా అస్తిత్త్వం?
ఎక్కడా ఓ ఆలంబన దొరక్క...
తల్లడిల్లి అల్లాడిపోయి నిస్సహాయనైపోయాను
నాకు బ్రతకాలని వుంది!
ఓ అస్తిత్త్వమా ?!కాస్త చేయి అందించి
వూత మియవూ......!!