నీవెంటే నేను- దాసరి సులోచనదేవి

నీ వెంటే నేను 

 

దాసరి సులోచన

 

 

 తప్పక వస్తానన్నావు నువ్వు

సూర్యోదయానికి ముందే

 

సుర్యమస్తామయమయినా,పక్షులు గూటికి

చేర వేళయినా నీ జాడలేదు

క్షణాలను లెక్క పెడుతూ ఎదురు

చూస్తూనే ఉన్నాను నీ రాక కోసం

 

అగకుండా కదిలిపోతున్న

కాలం వెంటే

పరుగులు పెడుతూ

నీకోసం, నేను వస్తూనే ఉంటాను

 

ఒకే ఒక్క క్షణం

ఆగి వెనక్కి చూడు