జగన్ తిరుపతి పర్యటనలో వైసీపీ రంగు పడింది

Publish Date:Sep 29, 2022

Advertisement

వైసీపీ రంగుల పంచాయతీ మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి ఆ పార్టీ రంగుల పిచ్చతో ఏకంగా దేవుడి బొమ్మలనే చెరిపేసింది. అది కూడా తిరుపతిలో అలిపిరి వెళ్లే దారిలో ఉండే గోడలపై ఉన్న దేవుడి బొమ్మలను చెరిపేసి వైసీపీ రంగులతో నింపేశారు. ఈ వ్యవహారంపై తిరుపతి ప్రజలలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

ఇప్పటి దాకా ప్రభుత్వ కార్యాలయాలూ, పాఠశాలలకు వైసీపీ రంగులు వేసి కోర్టు మొట్టికాయలతో వాటిని తీసేసి మళ్లీ గతంలోలా మామూలు రంగులు వేసి లక్షల్లో ప్రజా ధనం వృధా చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా అలిపిరి మార్గంలో దేవుడి బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు వేసిన వైనానికి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో వైసీపీ నాయకులు అలర్ట్ అయ్యారు. ఇదంతా తెలుగుదేశం దుష్ప్రచారం అంటూ ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా అలిపిరి మార్గంలో గోడలకు దేవుడి బొమ్మలు అలాగే ఉన్నాయనీ, వాటిని కనిపించకుండా వైసీపీ రంగులు వేశామనడం శుద్ధ అబద్ధమంటూ నాలుగు ప్రదేశాలలో దేవుడి బొమ్మలు ఉన్న వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.

దీంతో రంగుల పంచాయతీకి తెరపడుతుందని భావించిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేవలం నాలుగు చోట్ల మాత్రమే దేవుడి బొమ్మలను ఉంచారనీ మీగిలిన అన్ని ప్రాంతాలలోనూ బొమ్మలన్నిటినీ తొలగించారనీ పేర్కొంటూ అందుకు సంబంధిచి రుజువులతో సహా మరో వీడియోను తెలుగుదేశం ట్వీట్ చేసింది. దీంతో వైసీపీ నేతలు బొమ్మలు తొలగించలేదంటూ చేసిన వాదన శుద్ధ తప్పు అని తేలిపోవడంతో ఆ పార్టీకి రిటార్డ్ ఇచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో వైసీపీని వెనకేసుకొస్తూ తిరుపతి నగరపాలక సంస్థ రంగంలోనికి దిగింది. అలిపిరి మార్గంలో ఉన్న బొమ్మలు పాతవైపోవడంతో కొత్తగా రంగులు పూశామే తప్ప ఇందులో వైసీపీ ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది.

అయితే పూయడానికి వైసీపీ పార్టీని స్ఫురింప చేసే రంగులు వినా మరేమీ దొకరలేదా అంటూ నెటిజన్లు తిరుపతి నగరపాలక సంస్థపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద వైసీపీ రంగుల పంచాయతీ వెంకన్న దేవుడి పాదల వద్దకు చేరింది. వైసీపీ నేతల తీరును జనం కూడా తప్పుపడుతున్నారు.  తిరుపతి పవిత్రతను చెడగొడుతున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుపతిలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు ఎవరూ పాల్పడలేదని విమర్శిస్తున్నారు. వైసీపీ భ్రష్ట రాజకీయాలకు తిరుపతిని వేదిక చేసుకోవడం సరికాదనీ, దీనిని తామెంత మాత్రం అంగీకరించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే తిరుపతి నగరపాలక సంస్థపై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ తప్పదాలను కప్పి పుచ్చడం వినా తిరుపతి కార్పొరేషన్ కు మరో పని లేదా అని దుమ్మెత్తి పోస్తున్నారు. దేవుని చిత్రాలను తొలగించి రంగులు వేయడానికి తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలోనే ముహూర్తం కుదిరిందా అని నిలదీస్తున్నారు. లేదా జగన్ మొప్పు పొందడం కోసం ఆయన పర్యటన సందర్భంగా ఆయన పార్టీ రంగులు వేశారా అని ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఉండగా  తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మార్గంలో గోడలపై ఉన్న  దేవుళ్ల చిత్రాలను తొలగించి.. జగన్ పార్టీ రంగులు వేయడం హిందూ మతాన్ని అవమానపరచడమేనని తెలుగుదేశం అధినేత అన్నారు.  జగన్‌ తీరుపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారని ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్ కు రంగులు వేయక ముందు గోడపై హిందూ దేవుళ్ల చిత్రాలు ఉన్న ఫొటోను వైకాపా, పార్టీ రంగులు వేసిన తర్వాత ఫొటోలను జత చేశారు.   

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.