పీకేతో కేసీఆర్ కటీఫ్ అంతా ఉట్టిదే ..వ్యూహమే!

Publish Date:Sep 29, 2022

Advertisement

ఇంతకీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సంబంధాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెంచుకున్నారా?  పీకేనే కట్ చేశారా? ఈయనకు ఆయన కటీఫ్ చెప్పారా, ఆయనకు ఈయన కటీఫ్ చెప్పారా?  పీకేతో పనికాదని, కేసీఆర్ వ్యూహ కర్తను వదిలించు కున్నారా? కేసీఆర్ ను గెలిపించడం అయ్యే పని కాదని, పీకే వదిలి వెళ్ళిపోయారా? అసలు ఏమి జరిగింది? ఎందుకు విడిపోయారు?  అవును, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.

ఇందుకు సంబంధించి మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈయన ఆయనతో సంబంధాలు తెంచుకున్నారంటే, ఇంకొందరు ఆయనే ఈయనకు కటీఫ్ చెప్పారని అంటున్నారు. అయితే, ఏది నిజం, ఏది కాదు అంటే, అదీ నిజం కాదు, ఇదీ నిజం కాదు, అంటున్నాయి అసలు నిజం ఏంటో తెలిసిన  ప్రగతి భవన్, ఫార్మ హౌస్ ఇన్నర్ సర్కిల్స్.  అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అదీ ఇదీ ఏదీ నిజం కాదు. ఆయన ఈయనకు కటీఫ్ చెప్పలేదు. ఈయన ఆయనకు కటీఫ్ చెప్పలేదు. నిజానికి కటీఫ్ కథలు, కథనాలు అన్నీ కూడా కట్టు కథలే. అంతే కాదు కట్టు కథలు కూడా కేసీఆర్, పీకే సంయుక్త వ్యూహంలో భాగమే. నిజానికి, కేసీఆర్, పీకే ల మధ్య సమన్వయ బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎంపీ కథనం ప్రకారం, పీకే వ్యూహాలనే కేసీఆర్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. నిజానికి, ఇప్పుడు ఇద్దరి మధ్య అవగాహన మరింత పెరిగింది. ఇద్దరి మధ్యా బంధం మరింతగా బలపడిందని అంటున్నారు.  

అయితే, కటీఫ్  వదంతులు జోరుగా సాగడం వెనక పీకే వ్యూహం ఏమిటని ఆరా తీస్తే, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనక పీకే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే, ముఖ్యమంత్రి కుటుంబంలో ఏమి జరిగినా, జరగక పోయినా మీడియా అన్నిటికీ, పీకే ‘ఐ ప్యాక్’ ట్యాగ్  తొడిగేస్తోంది. రాజకీయ నిర్ణయాల విషయంలోనే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పీకే జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఇది ఎటుపోయి ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. మరో వంక ముడుగోడు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదంటే, ఇంకా పీకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో సెటైర్లు షికారు చేస్తున్నాయి.

పీకే టీమ్ సర్వే ఆధారంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, అందుకే అభ్యర్ధి ప్రకటన ఆలస్యం అవుతోందని, ముఖ్యమంత్రి స్థాయిని ,సామర్ధ్యాన్ని దిగజార్చే విధంగా పచారం జరుగుతోంది.  ఇలా ఒకటని కాదు, చివరకు, మంత్రి కేటీఆర్  కాలు విరిగి ఇంట్లో కూర్చుంటే, అది కూడా పీకీ వ్యూహమే అనే ప్రచారం జరిగింది. ఏపీలో కోడి కత్తి, బెంగాల్లో మమత వీల్ చైర్ ప్రచారంతో కేటీఅర్ కాలు ఫ్రాక్చర్ ను కలిపేసి పీకే ఖాతాలో వేస్తున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్, పూర్తిగా పీకే మీద ఆధారపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో, ముఖ్యమంత్రి, పార్టీ ఇమేజ్ డ్యామేజి అవుతోంది. ఇంత బతుకూ బతికి.. అనే సామెతను గుర్తుచేస్తోందని అంటున్నారు.

ఈ అన్నిటినీ మించి, పీకే సర్వేల పేరిట  జరుగతున్న ప్రచారం పార్టీ ఇమేజ్ ని బాగా డ్యామేజి చేస్తోంది. పబ్లిక్ పర్సెప్షన్ ప్రజాభిప్రాయం ను మార్చి వేస్తోందని, పీకే టీమ్ సర్వే లోనే బయట పడిందని అంటున్నారు. పీకే సర్వే లోనే తెరాస ఓడి పోతోందని ప్రతిపక్షలు చేస్తున్న ప్రచారం వలన, ప్రజలు అదే నిజం అనుకునే పరిస్థితి వచ్చింది.  పార్టీకి నష్టం జరుగుతోంది. అదే విధంగా, పీకే సర్వే ఆధారంగా అభ్యర్ధులను మార్చేస్తారనే ప్రచారం వలన ఫిరాయింపులు జరిగే ప్రమాదం ఉందనీ పీకే టీమ్ సర్వేలోనే తేలిందని, ఫలితంగా సమీకరణాలపై ప్రభావం ఉంటుందని అంటున్నారు.

అందుకే, పీకేతో తెగతెంపులు చేసుకున్నామనే ప్రచారం వలన, పీకే పేరున జరుగతున్న వ్యతిరేక ప్రచారాన్ని, కట్టడి చేయవచ్చని, అందుకే  కేసీఆర్, పీకే వ్యూహాత్మకంగా కటీఫ్ కథలను తెర మీదకు తెచ్చారని అంటున్నారు. అయితే, అదే నిజామా అంటే, ఏమో, కానీ, పీకే పేరున జరుగుతున్న ప్రచారం వలన తెరాసకు నష్టం జరుగుతోందనేది మాత్రం పచ్చి నిజం అంటున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.