మానుగుంటపై ఉన్న నమ్మకం గంటాపై లేకుండా పోయిందా?
Publish Date:Aug 22, 2012
Advertisement
విశాఖ జిల్లా నక్కపల్లిలో ఓడరేవు మంజూరయ్యే సమస్యేలేదు కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మంజూరై తీరుతుందని విశాఖజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మకంగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఓడరేవు మానుగుంట మహీధరరెడ్డి చిరకాల కోరిక కాబట్టి అది తీరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అస్సలు ఓడలరేవు మంజూరుపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటాశ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నా తెలుగుదేశం నేతలు మాత్రం నమ్మటం లేదు. అందుకే నక్కపల్లిలో ఓడరేవు ఏర్పాటు విషయమై అఖిలపక్షనేతలతో మంత్రిగంటాశ్రీనివాసరావు ఏర్పాటు చేసిన సమావేశాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు బహిష్కరించారు. పైగా ఈ సమావేశ వేదిక వద్ద ప్రకాశం జిల్లాకు పోర్టు మంజూరవుతుందని తెలుగుదేశం నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ నక్కపల్లికి ఓడరేవు రాకపోతే గంటా మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.
పోర్టుశాఖ ఓడరేవు గురించి ఒక నిర్ణయానికి రాలేదని మంత్రి గంటా చెబుతుంటే వారు నిరసన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా వారు వెళ్లిపోవటంతో గంటా మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు సేకరించిన తరువాతే ఓడలరేవును ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం వెలువడే లోపు ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బహిష్కరించటంతో తప్పని సరి పరిస్థితుల్లో మంత్రి గంటాశ్రీనివాసరావు వెనుదిరిగారు.
http://www.teluguone.com/news/content/విశాఖ-‘దేశం’కు-మానుగుంటపై-ఉన్న-నమ్మకం-గంటాపై-లేకుండా-పోయిందా-24-16742.html





