ప్యాకెట్లో డబ్బుంటే... సిక్స్‌ ప్యాక్‌ రెడీ!

Publish Date:Aug 22, 2012

Advertisement

యూత్‌ దేన్నయినా తొందరగా అర్ధం చేసుకుంటుంది. అంతే తొందరగా అలవాటుపడిపోతుంది. కాకుంటే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అలవాటు చేసుకున్న వాటిని వదులుకోవడమే...! ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యువకుల నోట వినిపిస్తున్న మాట సిక్స్‌ ప్యాక్‌. పదిమందిలో తాము ఒకరుగా గుర్తింపు కోసం కావచ్చు, అమ్మాయిలు తమను చూసి మెచ్చుకుని స్నేహం చేయాలన్న ఆశ కావచ్చు... చాలామంది నేడు సిక్స్‌ ప్యాక్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు...! ఇలా సిక్స్‌ ప్యాక్‌లకోసం ప్రయత్నించే సినిమా హీరోలయితే చాలామందే ఉన్నారు.


 

సల్మాన్‌, షారుఖ్‌,  అమీర్‌ఖాన్‌ వంటి హిందీ హీరోలు ఈ ప్యాక్‌లతో అభిమానులను అలరించినవారే.. ఈ జాబితాలో తెలుగుసినిమా కూడా చేరింది. సిక్స్‌ ప్యాక్‌లతో నేటియువతరం టాలీవుడ్‌ హీరోలు అభిమానులను అలరిస్తున్నారు. ఏదిఏమైనా` ఏకొత్త అంశమైనా కొద్ది కాలం తర్వాత పాతబడిపోతుందన్నట్లుగానే... ఈ ప్యాక్‌లకు కూడా ఒకటి, రెండు సినిమాలకు తప్ప ఆ తర్వాత ఆసక్తి తగ్గుతుందనేది మామూలే...! అయినా పర్లేదు... సిక్స్‌ప్యాక్‌ కావల్సిందే అనుకుంటే మాత్రం అందుకోసం జిమ్‌లలో గంటల తరబడి కసరత్తులు చేయవలసి వస్తుంది. 



అయితే సిక్స్‌ప్యాక్‌ అంటే ఇష్టమున్నా వారిశరీరకశక్తి  ఇటువంటి ఎక్సర్‌సైజ్‌లకు సహకరించకపోతే నిరాశచెందనక్కర్లేదటున్నారు దాక్టర్లు. ఇకనుండి సిక్స్‌ప్యాక్‌ కావాలంటే జిమ్‌లకు వెళ్ళనక్కరలేదని  కాసేపు ఆపరేషన్‌  చేయించుకుంటే చాలు  సిక్స్‌ప్యాక్‌ దేహం ఎవరికైనా రెడీ అని  కాస్మెటాలజిస్టులు భరోసా ఇస్తున్నారు. సర్జరీలో భాగంగా  లైపో స్కల్ప్సర్‌ తదితర టెక్నిక్‌లను వినియోగించి సిక్స్‌ప్యాక్‌ దేహం వచ్చేలా చేస్తారు. ఊబకాయంఉన్నవారు, బాగా సన్నగా, ఉండవలసిన బరువుకన్నా  బాగా తక్కువ బరువున్న వారికి ఈ సర్జరీ చేయరనీ, ఆరోగ్యంగా వున్న వారు ఈచికిత్స చేయించుకోవచ్చని కాస్మెటాలజిస్టులు వారంటున్నారు.



అయితే  దీనికి  డబ్బులు కూడా దండిగానే ఖర్చవుతాయట...!.ఉత్తరాదికి చెందిన టీవీ నటులు, మోడల్స్‌, సినిమా ఛాన్స్‌లకోసం అన్వేషణ సాగిస్తున్నవారు ఇటువంటి చికిత్సలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే` ఆపరేషన్‌తో సాధించిన సిక్స్‌ప్యాక్‌ స్థిరంగా ఎంతకాలం ఉంటుందన్నది సమాధానంలేని ప్రశ్నే...! అయినా ఫరవాలేదనుకునేవారు సిక్స్‌ప్యాకులకోసం ప్రయత్నించవచ్చు.

 

By
en-us Political News

  
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.