జగన్‌కు రైతుల స్ట్రాంగ్ కౌంటర్
Publish Date:Jan 11, 2026
Advertisement
వైసీపీ అధ్యక్షుడ జగన్‌పై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ స్ట్రాంగ్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి పనులు జరుగున్నాయని స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ అనడం సమంజసమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం (11-1-26) ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అమరావతి స్మశానం, ఎడారి అన్నారని.. అందుకనే ఆ పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారనన్నారు. రాజ్యంగానికి భిన్నంగా జగన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నందుకు జగన్‌పై వెంటనే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారణం కూడా అమరావతి ఉద్యమమేనని స్పష్టం చేశారు. జగన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని చెప్పుకొచ్చారు. జగన్‌కు ధైర్యం ఉంటే 11 మందితో కలిసి అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అధికార పక్షం తప్పులుంటే జగన్ అండ్ కో ఎత్తి చూపాలని సూచించారు. గత ఐదేళ్లు జగన్ ఎక్కడ ఉండి పరిపాలన చేశారని నిలదీశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందని ప్రస్తావించారు. 2015లోనే అమరావతిపై గ్రీన్ ట్రైబ్యునల్‌లో జగన్ కేసు వేయించారని గుర్తు చేశారు. అమరావతికి గ్రీన్ ట్రిబ్యునల్ క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలిపారు. అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్‌పై తమకు వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కూడా అమరావతిలోనే ఉంటున్నారని ప్రస్తావించారు. జగన్ ఇలానే నడుచుకుంటే రాజకీయ సమాధి కట్టడానికి రాజధాని మహిళలు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. జగన్‌ని మోసపు రెడ్డి అని అనొచ్చని ఎద్దేవా చేశారు. జగన్ బటన్ నొక్కడమే పరిపాలన అనుకున్నారని విమర్శించారు. జగన్ సగం సగం మాట్లాడతారని, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతారని సెటైర్లు గుప్పించారు. సో కాల్డ్ అనే పదం జగన్ మానుకోవాలని.. లేదంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమరావతి పేరు చెప్పడానికే కూడా జగన్ ఇష్టపడడం లేదని వారు మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/ysrcp-president-jagan-36-212379.html





