స్పోర్ట్స్ హాస్టల్‌లో ఇద్దరు బాలికలు సుసైడ్
Publish Date:Jan 15, 2026
Advertisement
కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు మైనర్ ట్రైనీ బాలికలు (17, 15 ఏళ్లు) ఇవాళ ఉదయం తమ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోజికోడ్, తిరువనంతపురానికి చెందిన వీరు ఒకరు అథ్లెటిక్స్, మరొకరు కబడ్డీ క్రీడాకారిణి. మార్నింగ్ ట్రైనింగ్ సెషన్‌కు ఆ ఇద్దరు బాలికలు హాజరు కాకపోవడంతో ఇతర విద్యార్థినులకు అనుమానం వచ్చింది. ఆ బాలికల రూమ్‌కు వెళ్లి పదేపదే తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో హాస్టల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు తలుపు పగలగొట్టి చూశారు. గదిలో ఇద్దరు బాలికలు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె పదో తరగతి చదువుతోంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sports-authority-of-india-hostel-36-212549.html





