శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం
Publish Date:Jan 14, 2026
Advertisement
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బుధవారం ( జనవరి 14) సాయంత్రం మకరజ్యోతి దర్శనం కనువిందు చేసంది. అశేష భక్తజన సందోహం మధ్య అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శన మిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు. అంతకుముందు.. పందళం రాజప్రాసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. అనంతరం, ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక దీపా రాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోయాయి. అయ్యప్ప భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్ దేవస్ధానం బోర్డు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.
http://www.teluguone.com/news/content/makarajyothi-darshan-in-sabarimalao-36-212530.html





