వైసీపీపై బీజేపీ ముప్పేటదాడి... కుమ్మక్కు ముద్ర చెరిపేసుకోవడానికా?

Publish Date:Aug 15, 2025

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లపాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని సిట్ అధికారులు తమ అనుబంధ చార్జ్‌షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు . మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మార్చుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎలాంటి అనుచిత నిర్ణయాలు తీసుకున్నారో అందులో వెల్లడించారు. ఉన్నతాధికారుల సిఫార్సులను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టారని స్పష్టం చేసింది.  సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌‌రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల ప్రమేయానికి సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేశారు. గతంలో వేసిన చార్జ్‌షీట్లో ఏడుగురు వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా ... అదనంగా ముగ్గురు నిందితులపై అభియోగాలు మోపింది. 

తాజా ఛార్జ్ షీట్లో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు పొందుపరించింది. మొత్తానికి లిక్కర్ స్కాంలో జగన్ నిర్ణయాలే కీలకమని స్పష్టం చేసింది. అయినా టీడీపీ, జనసేన నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారే కాని.. వైసీపీ మందిమగాదుల్ని కాని, జగన్‌ని కాని టార్గెట్ చేయడం లేదు. అయితే మిత్రపక్షమైన బీజేపీ మాత్రం అదే పనిగా పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.బిజెపి..వైసిపి ఒక్కటే.. అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎలాగైనా పోగొట్టాలని బిజెపి అష్టకష్టాలు పడుతోందట.  తాజాగా లిక్కర్ స్కాంపై పదే పదే విమర్శలకు దిగుతోంది బిజెపి. ఒకవైపు టిడిపి మంత్రులకు చంద్రబాబు లిక్కర్ స్కాం పై మాట్లాడొద్దని ఆదేశాలిచ్చినా బిజెపి మాత్రం బిగ్ బాస్ జగనే అంటూ ముప్పేట దాడి చేస్తుంది. 2019 నుంచి 2024 వరకు ఎపిలో వైసిపి అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా వైసిపి మద్ధతిచ్చింది. ప్రస్తుతం కూడా బీజేపీ అధిష్టానం తో మంచి రేపో నడుపుతుందన్న ప్రచారం జరుగుతోంది. 

ఆ క్రమంలో ఈ ప్రచారమే కూటమి ద్వితీయ శ్రేణి నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. బిజెపి ఏపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ కు కూడా అది తలనొప్పిగా మారిందంట. దీంతో కూటమి శ్రేణులకు ఎలాగైనా దగ్గరవ్వాలనే యోచనలో వైసిపి అధినేత జగన్ పై మాటల దాడి పెంచాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత వైసిపి పాలనలో జరిగిన అవినీతి ని ఎండగడుతూనే లిక్కర్ స్కాం ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.  గతంలో పురంధేశ్వరి ఏపి బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మద్యం తాగి చనిపోయి, మంచాన పడ్డవారి లెక్కలతో సహా ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తాజాగా మాధవ్ కూడా ఆమె లైన్ లోనే వెళ్తూ లిక్కర్ స్కాం లో త్వరలో బిగ్ బాస్ జగన్ జైలుకు వెళతారంటూ మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బిజెపి మంత్రి సత్యకుమార్ తో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు వైపీపీ లిక్కర్ స్కాం పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న ఏ ఒక్కరు తప్పించుకోలేరంటూ మీడియా ముందు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. 

కాని లిక్కర్ స్కాం పై టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆ పార్టీ మంత్రులను మాట్లాడవద్దని క్యాబినెట్‌లో చెప్పడం కొసమెరుపు. మరోవైపు లిక్కర్ స్కాం పై బిజెపి పదే పదే ఆరోపణలు చేస్తున్నా వైసిపి మాత్రం స్పందించడం లేదు. వరుస ఆరెస్టులు జరుగుతుంటే టిడిపి ని మాత్రం విమర్శిస్తున్నా బిజెపి జోలికి  మాత్రం వెళ్లడం లేదు. దీంతో కమలనాధుల ఆరోపణలకు ప్రతిస్పందన లేకపోవడంతో బిజెపి, వైసిపి ఒక్కటే నంటూ గుసగుసలు వినబడుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి లిక్కర్ స్కాం తో పాటు ఇతర స్కాంలు, గతంలో జరిగిన పాలనపై వరుస పోరాటాలు చేయాలని, మాధవ్ తో సహా బిజెపి శ్రేణులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బిగ్ బాస్ ను టార్గెట్ చేస్తూ అక్కడి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారిపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించారట. ఈ నేపధ్యంలోనే వైసిపిపై బీజేపీ వర్గాలు ముప్పేట దాడి చేస్తున్నాయంట.  చూడాలి మరి వైసిపి ని విమర్శించి ఏపీలో బలపడాలన్న బిజెపి ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో?

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.