ఢిల్లీలోనే డీల్..రాములమ్మ రూట్‌లో అజారుద్దీన్ ?

Publish Date:Aug 15, 2025

Advertisement

 

ఇటు నుంచి కాకపోతే, అటునుంచి నరుక్కురమ్మని అంటారు, పెద్దలు. మాజీ క్రికెటర్, ప్రస్తుత  పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు, మహమ్మద్ అజారుద్దీన్, అక్షరాలా అదే చేస్తున్నారు. అవును, అసెంబ్లీలో అడుగుపెట్టాలనే, తమ చిరకాల స్వప్నం నెరవేరాలంటే, జూబ్లీ’’ ఉప ఎన్నిక చక్కటి అవకాశంగా భావిస్తున్న,అజారుద్దీన్,ఈ అవకాశాన్నిఎట్టి పరిస్థితిలో వదులు కోరాదని భావిస్తున్నారు. అసలు ఈ ఉప ఎన్నిక వచ్చిందే తన కోసమని అజార్’ గట్టిగా నమ్ముతున్నట్లు చేపుతున్నారు. అందుకే, అయన కాంగ్రెస్ ‘టికెట్’ కోసం  ఎందాకా అయినా వెళ్లేందుకు రెడీ’ అటున్నారు. నిజానికి,జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే’ మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణ వార్త చెవిన పడగానే, అజారుద్దీన్’ నిముషం లేటు’ చేయకుండా, ఖాళీ కుర్చీలో కర్చీఫ్’ వేశారు. గత (2023) అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిన, ఆయన  ఈసారి టికెట్’ తనకే వస్తుందనే ధీమాను బహిరంగంగానే వ్యక్తపరిచారు.

 అదేదో సినిమాలో మహేష్ బాబు, తుపాకీ నాదే .. బులెట్’ నాదే’ అంటాడు చూడండి, అలాగే , అదే  స్టైల్లో’ ‘టికెట్ నాదే, గెలుపు నాదే’ అని స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయన ధీమా పై కోల్డ్ వాటర్’ కుమ్మరించారు.జూబ్లీ’అభ్యర్ధిని అధిష్టానం నిర్ణయిస్తుంది, అంతవరకూ ఎవరూ, స్వీయ’ప్రకటనలు చేయవద్దని సీరియస్’గా వార్నింగ్ ఇచ్చారు. మరో వంక, జూబ్లీ’లో గెలిస్తే మంత్రి పదవి’ ఖాయమనే ప్రచారం ఉపందుకోవడంతో  జూబ్లీ టిక్కెట్’కు  ‘డబుల్ ధమాకా’ స్థాయిలో గిరాకీ పెరిగింది. టికెట్ ఆశించే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. దీంతో మొదట్లో అజారుద్దీన్’ వైపు మొగ్గుచూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అందుకు పోటీ ఎక్కువకావడం ఒక కారణం అయితే, ముస్లిం యేతరులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని, అప్పుడే కాంగ్రస్’కు  తమ మద్దతు ఉంటుదని ఎంఐఎం షరతు విధించడం మరో కారణంగా చెపుతున్నారు.మరో వంక, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్’ స్థానికులకే జూబ్లీ టికెట్’ అని ప్రకటించి, అజార్ ఆశలపై మరో బకెట్ కూల్ వాటర్ కుమ్మరించారు.

నిజానికి,ఉప ఎన్నికలో తానే అభ్యర్థినంటూ అజార్‌ ప్రకటించుకోవడంతో ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారని, వెంటనే తమ వ్యూహానికి పదును పెట్టినట్లు చెపుతున్నారు. అజార్‌కు’ చెక్  పెట్టేందుకు, క్రికెట్ అసోసియేషన్ రాజకీయాల్లోఅజార్’ పొడ అయినా గిట్ట్టని మంత్రి వివేక్’ రంగంలోకి దించి నట్లు చెపుతున్నారు.మంత్రి వివేక్‌ ఒకడుగు ముందుకేసి ఆ బాధ్యతను భుజాన వేసుకున్నట్టు పార్టీవర్గాలలో వినవస్తోంది.ఇక్కడే అజార్’ ఇటునుంచి కాకపోతే, అటు నుంచి నరుక్కు రమ్మన్న పెద్దలమాటను గుర్తుకు తెచ్చుకుని, ఢిల్లీ నుంచి చక్రం తిప్పడం ప్రారంభించారు. డైరెక్ట్’గా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్’ అగ్రనేతలు  సోనియా గాంధీ. రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. జూబ్లీ టికెట్’ ఇవ్వాలని, అభ్యర్ధించి నట్లు సన్నిహితులు చెపుతున్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. 

పీసీసీ నుంచి తన పేరును పంపినా పంపకున్నా, అధిష్టానం జాబితాలో మాత్రం చోటు చిక్కెలా’ ఏర్పాట్లు చేసుకునట్లు చెపుతున్నారు.అయితే, అధిష్టానం అప్పాయింట్మెంట్ ఇచ్చినంత తేలిగ్గా టికెట్ ఇస్తుందా, ముఖ్యంగా, లక్షా 20 వేల ముస్లిం ఒట్లున్న నియోజక వర్గంలో, ఒవైసీలను కాదని, కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్’ కు టికెట్’ ఇచ్చే సాహసం చేస్తుందా? అనేది ఇప్పడు పెద్ద ప్రశ్నగా మారిందని అంటున్నారు. అయితే,గతంలో, రాష్ట్ర నాయకులకు మాట మాత్రంగా అయినా  చెప్పకుండానే, విజయశాంతి ఏ రూటులో అయితే ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారో, అదే రూట్’ లో తనకు  ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, అజార్ విశ్వాసంతో ఉన్నట్లు  చెపుతున్నారు. నిజమో కాదో కాన,, అజార్ అనుచరులు మాత్రం, అగ్రనేతలు ఇద్దరు  గ్రీన్ సిగ్నల్’ ఇచ్చారని అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.