6వ తేదీ లోగా జగన్ అరెస్ట్?

Publish Date:Apr 3, 2012

Advertisement

సిబిఐ అధికారులు ఈనెల 6వ తేదీ లోగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్ధులు కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేస్తుండటం విశేషం. ఒకవైపు తాను ఏం తప్పు చేశానని సిబిఐ తనను అరెస్ట్ చేస్తుందని జగన్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ఆయన అభిమానులు నిత్యం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం జగన్ ను అరెస్ట్ చేస్తే ఈ నెల 6 వ తేదీలోగా అరెస్ట్ చేయవచ్చని ఈ లోగా అరెస్ట్ కాకపొతే ఆయనను మరెప్పటికీ అరెస్ట్ చేయడం సాధ్యంకాదని అంటున్నారు. 6వ తేదీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నప్పటికీ సిబిఐ అనుబంధ చార్జ్ షీట్ వేసి దానిలో కోర్టుకు సాక్ష్యాలు చూపించే సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యకలాపాలే ఇటువంటి ఊహాగానాలకు కారణమావుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడమే కాకుండా ఆయనకు ప్రముఖులకు కల్పించే వై కేటగిరి భద్రతలు కూడా ఇచ్చారు.

 

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఇప్పటికే అధ్వాన్నంగా ఉంది. బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారవచ్చునని అధిష్టానం భయపడుతోంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వ్యూహాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఎవరో ఒక ప్రముఖుడ్ని అరెస్ట్ చేస్తారనుకుంటున్న తరుణంలో ఆయన అనామకులను అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా అటువంటిదే జరగవచ్చునన్న వదంతులు కూడా వినవస్తున్నాయి. జగన్ భార్య భారతిని కూడా అక్రమాస్తుల కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. అందువల్ల ఆమెను ఇంటరాగేషన్ కు పిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు. జగన్ ను అరెస్ట్ చేయకుండా భారతిని ఇంటరగేట్ చేయడం ద్వారా జగన్ వర్గాన్ని ఆందోళనలకు గురిచేయాలన్నై లక్ష్మీనారాయణ వ్యూహంగా తెలుస్తోంది.

 

 

By
en-us Political News

  
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.