జగన్‌కు కేసు:సునీల్ ను రహస్యంగా ప్రశ్నిస్తున్న సిబిఐ ?
Publish Date:Jan 23, 2012
Advertisement
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ పిఏ సునీల్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బంధువు, జగన్ సన్నిహితుడు అయిన సునీల్ రెడ్డిని తమ అదుపులోకి తీసుకున్నట్లు సిబిఐ వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. ఈ కేసులో సాక్షిగానే ఆయనను సిబిఐ అధికారులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆయనను సిబిఐ ప్రశ్నించి వదిలేస్తారా అదుపులోకి తీసుకున్నామని ప్రకటిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇప్పటికే జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు జరిగినందున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ సాయి అరెస్టు సైలెంట్‌గానే జరగడం గమనార్హం. కాగా సునీల్ రెడ్డిని గత రెండు రోజులుగా సిబిఐ అధికారులు దిల్ కుషా అతిథి గృహంలో ప్రశ్నిస్తున్నారు. ఆయన నుండి పలు విషయాలు సిబిఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులు, ఇతరత్రా అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. జగన్ కంపెనీలకు చెందిన చాలా ఆర్థిక లావాదేవీలు సునీల్ రెడ్డికి తెలిసే అవకాశముంది. గతంలోనూ సునీల్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించింది.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-24-11182.html





