మద్దతు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది :రేవంత్
Publish Date:Jan 24, 2012
Advertisement
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావును వ్యతిరేకించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి మద్దతు పలకడం శోచనీయం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో సూచించారు. ఇలా చేయడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడనే మాటల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అది నూటికి నూరుపాళ్లు అబద్దమన్నారు. ఆయన టిడిపికి దూరం కారన్నారు. ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకోలేదని, కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్కు చిత్రాలు రాకుండా తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారనే వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్టీఆర్కు సినిమాలు లేవంటే ఆయనను అవమానించినట్లేనన్నారు. జగన్కు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత లక్ష్మీ పార్వతి మాట్లాడాలన్నారు. జూ.ఎన్టీఆర్ ఖచ్చితంగా టిడిపిలో ఓ భాగమని మరో నేత వర్ల రామయ్య చెప్పారు. లక్ష్మీ పార్వతి గోబెల్స్ ప్రచారం మనుకోవాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/ntr-24-11183.html





