జగన్ కేసులోనూ..శ్రీలక్ష్మి, రాజగోపాల్

Publish Date:Feb 14, 2012

Advertisement

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులోనూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనులశాఖ మాజీ అధికారి రాజగోపాల్‌ను విచారించడానికి అనుమతించాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. జగన్ కేసుకు సంబంధించి చేస్తున్న దర్యాప్తులో భాగంగా అనేక ఫైళ్లను పరిశీలించామని, వాటన్నింటినీ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి, గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్న రాజగోపాల్ ప్రాసెస్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో వారిద్దరినీ విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు సీబీఐ ఎస్పీ వెంకటేశ్ మంగళవారం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం గనుల వ్యవహారంలో అరెస్టయి, ప్రసుత్తం జైల్లో ఉన్న శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను అక్కడే విచారించేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. కాగా, పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. జగన్ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి జారీ చేసిన తొమ్మిది జీవోలపై దృష్టి సారించారు.


వాస్తవానికి ఈ జీవోలు జారీ కావడంలో కీలకమైన నోట్‌ఫైల్‌ను నాటి గనులశాఖ మంత్రి సబిత ఆమోదించడం గమనార్హం. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడుల పెట్టిన కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి, రాజగోపాల్ ద్వారా చర్యలు తీసుకున్నారనే అనుమానంపై సిబిఐ వారి విచారణకు అనుమతిని కోరినట్లు తెలుస్తోంది. దాల్మియా సిమెంట్స్, అన్‌రాక్ సంస్థలకు గనుల లీజుపై సిబిఐ అధికారులు వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాము స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా వారిద్దరిని విచారించడం ద్వారా రాబట్టే సమాచారం ఆధారంగా జగన్ ఆస్తుల కేసులో పురోగతి సాధించవచ్చునని సిబిఐ అనుకుంటున్నట్లు సమాచారం. కాగా, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ప్రభుత్వాధికారి బాలకృష్ణను సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పెన్నా సిమెంట్స్ వ్యవహారాలపై సిబిఐ అధికారులు బాలకృష్ణను విచారించినట్లు తెలుస్తోంది.

అక్రమాల ఐఏఎస్ శ్రీలక్ష్మిపై చార్జిషీటు నమోదులో మరింత ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి 'గ్రీన్ సిగ్నల్' రాకపోవడమే దీనికి కారణం. ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది. శ్రీలక్ష్మి పాత్ర, ఆమెపై అభియోగాలతో అదనపు చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ రెండు నెలల క్రితం కోర్టుకు తెలిపింది. కానీ... ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. కేంద్రం నుంచి అనుమతి రానందునే ఇందులో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయ సాయిరెడ్డి రిమాండ్‌ను సీబీఐ కోర్టు వారం రోజులు పొడిగించింది.

By
en-us Political News

  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.